
చుట్టూ లోయలు.. శత్రువులు అడుగు పెట్టలేని దుర్భేద్యమైన కట్టడాలు.. ఎటుచూసినా ప్రకృతి రమణీయ దృశ్యాలు.. వీటన్నింటికీ నెలవు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోట. జమ్మలమడుగు నుంచి 11 కిలోమీటర్ల దూరంలో పెన్నానది ఒడ్డున ఈ చారిత్రక కట్టడం ఉంది. పెన్నా, చిత్రావతి రెండు నదులు కలిసే చోట సహజ సిద్ధంగా ఏర్పడిన బ్రహ్మాండమైన గండికి సమీపంలో నిర్మించడంతో ‘గండికోట’ అనే పేరొచ్చింది. ‘గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా’గా పిలుచుకునే గండికోటకు 903 ఏళ్లు నిండాయి. పెన్నా, చిత్రావతి రెండు నదులు కలిసే చోట కొండల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన గండి ప్రదేశానికి సమీపంలో కల్యాణ చాళుక్య రాజు అహవమల్లకు సామంతుడైన కాకరాజు కోట నిర్మాణానికి 1123 జనవరి 9న శ్రీకారం చుట్టారు. దీంతో ‘గండికోట’ అనే పేరొచ్చింది. అలనాటి పౌరుషాలు, యుద్ధాలు, రాజుల పరాక్రమం, రాజకీయ, సామాజిక పరిస్థితులకు నిలువుటద్దమిది.
ఆరోసారి ఉత్సవాలు
గండికోటలో ఇప్పటి వరకు 2015, 2017, 2018, 2019, 2020లో అయిదు సార్లు వారసత్వ ఉత్సవాలు నిర్వహించారు. జులై 1న ముఖ్యమంత్రి చంద్రబాబు గండికోటను సందర్శించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 11, 12, 13 తేదీల్లో వారసత్వ ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఎన్నెన్నో విశేషాల సమాహారం





