
భక్తి వ్యాపారంగా రూపాంతరం చెందింది. బ్రిటిష్ పాలనకు ముందు నుంచి మొదలైన మత మార్పిడులు నేడు పరాకాష్టకు చేరాయి. ప్రతి గల్లీకో చర్చి నిర్మాణం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ పోకడ పెడదోరణులకు దారితీస్తోంది. విదేశీ నిధులను కేంద్ర హోం శాఖ కట్టడి చేయడంతో, దేశీయంగానే చర్చిల నిర్మాణం పేరుతో పాస్టర్లు వందల కోట్లు వసూలు చేస్తున్నారు.
కొందరు పాస్టర్లు వ్యక్తిగత ప్రయోజనాల కోసం విరాళాలను దుర్వినియోగం చేస్తున్నారు. దేశీయంగా సేకరించే విరాళాల ఆడిటింగ్ లేకపోవడంతో పాస్టర్ల పంట పండుతోంది. ఇటీవల కోస్తా జిల్లాలకు చెందిన ఓ పాస్టర్ చర్చి పేరుతో రూ.50 కోట్లు విరాళాలు సేకరించాడన వార్త వైరల్ అయింది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేని దుస్థితి. విదేశాల నుంచి గతంలో పెద్ద ఎత్తున నిధులు ప్రవహించేవి. కేంద్ర హోం శాఖ FCRA కింద విదేశీ విరాళాలను స్వీకరించే NGOలు/చర్చిలను పర్యవేక్షిస్తోంది. దీంతో నిధుల ప్రవాహానికి గండి పడింది. అప్పటి నుంచి దేశీయంగానే విరాళాల పేరుతో కొందరు పాస్టర్లు భారీగా విరాళాలు సేకరిస్తున్నారు.
హైదరాబాద్‌లోని చందానగర్ సమీపంలో ఓ పేరున్న పాస్టర్ రూ.250 కోట్లతో లక్ష మంది ఒకేసారి ప్రార్థన చేసే విధంగా, స్డేడియాలను మించిపోయే రీతిలో నిర్మాణాలు చేశారంటే వారి భక్తి వ్యాపారం, ఏ విధంగా చాపకింద నీరులా ప్రవహిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక అదే పాస్టర్ గుంటూరు విజయవాడ జాతీయ రహదారికి అత్యంత సమీపంలో నాగార్జున యూనివర్సిటీ సమీపంలో 20 ఎకరాల్లో వంద కోట్లతో చేసిన నిర్మాణాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పదేళ్ల కిందట తినడానికి తిండిలేని స్థాయి నుంచి నేడు వేల కోట్ల సామ్రాజ్యం నిర్మించుకున్న ఆ పాస్టర్ విజయగాథలను వేలాది మంది ఆదర్శంగా తీసుకుని ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు.
పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన లోపం
చర్చి నిర్మాణం చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. విదేశీ నిధులు సేకరించాలంటే FCRA స్థితిని ధృవీకరించాలి. ఏటా ఆర్థిక నివేదికలు,ఆడిట్‌లను నిర్వహించాలి. ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు, ఆదాయపన్ను అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అలా చేసే వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో కొందరు పాస్టర్లు సేకరించే కోట్లాది రూపాయల విరాళాలకు ఆడిటింగ్ లేకుండా పోయింది.
విజయవాడలో ఓ ఫాస్టర్ సాధించిన విజయం రెండు జిల్లాల వారికి పరిచయమే. విజయవాడ సమీపంలోని రామలింగేశ్వరనగర్‌లో రూ.50 కోట్ల ఖర్చుతో ఒకేసారి 5 వేల మంది శీతల వాతావరణంలో కూర్చుని ప్రార్థనలు చేసుకునే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది గమనించిన కొందరు పాస్టర్ల అవతారం ఎత్తుతున్నారు. అంటే ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారంగా క్రిస్టియానిటీ ప్రచారం చేయడం అనే బిజినెస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని చర్చిలున్నాయి. ఎంత మంది పాస్టర్లు ఉన్నాయి. అనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకే కాదు. గూగుల్ తల్లికి కూడా తెలయనంత విధంగా వ్యవస్థను రూపొందించారు. ఎక్కడా కూడా చర్చి నిర్మాణాలకు అనుమతులు తీసుకోవడం లేదు. కనీసం ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించకుండా అంతస్తుల్లో చర్చి నిర్మించడం, అందులోనే ఓ ప్లోర్ చర్చి ఫాదర్ కుటుంబం నివాసం ఏర్పాటు చేసుకోవడం ఈ ప్రాంతంలో ఆనవాయితీ.
గతంలో ఆదివారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసేవారు. నేడు ప్రతి రోజూ ఒక ప్రత్యేకతే. దీంతో కొన్ని ప్రాంతాలు చర్చి మైకుల హోరుతో శబ్ధ కాలుష్యం వెదజల్లుతున్నాయి. జనం శబ్ద కాలుష్యం భరించలేక, హిందువులు ఆయా ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. అయినా మైకులు కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం గానీ, రెవెన్యూ అధికారులుగానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే పాస్టర్ల ఆదాయమే ఎక్కువ అనే నానుడి ఉంది. ఇదేదో జోక్‌గా చెబుతున్న మాట కాదు. పాస్టర్ కావాలంటే పదో తరగతి కూడా పాస్ కావాల్సిన పని లేదు. తెలుగు చదవడం, బాగా అరవడం వస్తే చాలు. భక్తులను ఆకట్టుకునే విధంగా యాక్షన్ మేళవిస్తే ఇక తిరుగే లేదు. 18 సంవత్సరాలకే పాస్టర్ అవతారం ఎత్తి, పదో తరగతి కూడా చదువు లేని ఓ పాస్టర్ ఆదాయం నెలకు పది లక్షలు పైనే అంటే అతిశయోక్తి కాదు. వారి పిల్లలను విదేశాల్లో చదివిస్తూ, ఈ రంగంలో అడుగుపెట్టే పాస్టర్లకు ఆదర్శంగా నిలిచేలా మూడు చర్చిలు నిర్మించాడు.
చర్చి అనేది ముందుగా గుడిసెలో మొదలవుతుంది. ప్రభుత్వ స్థలం కబ్జా చేసి తాటాకుల పాకలో ప్రస్తానం మొదలు పెడతారు ఐదేళ్లు తిరిగే సరికి అక్కడ భవనం వెలుస్తుంది. ఎలా సాధ్యం అంటే. దశమ భాగం మహత్యం అని అందరికీ తెలిసిందే. ఇలా వందల కోట్లు విరాళాలు వసూలు చేస్తూ క్రిస్టియానిటీని వ్యాపారంగా మార్చిన కొందరు పాస్టర్లు మతమార్పిడులకు పాల్పడుతూ ఇతర మతాలకు సవాల్ విసురుతున్నారు.



