
నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆవాసం నందు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయి గారి జయంతి ఉత్సవం వైభవంగా జరిగింది. సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సక్షమ్ జిల్లా ప్రముఖ్ శ్రీ ఎస్ ఎస్ ఎఫ్ సుబ్బారావు ముఖ్య అతిథిగా, సంఘమిత్ర సహకార దర్శి శ్రీ సుందర రావు ప్రధాన వక్తగా పాల్గొన్నారు.

సదరు కార్యక్రమంలో సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ జే వెంకటేశ్వర్లు, సంఘమిత్ర కోశాధికారి శ్రీ సముద్రాల నాగరాజయ్య తదితరులు పాల్గొన్నారు. వక్త సందేశంలో వాజ్ పాయి గారి సచ్చీలత, మొక్కవోని సంకల్ప బలం, వారి హాస్య చతురత, వారి కవి హృదయం మున్నగునవి వివరించారు. పార్టీల కతీతంగా వారి అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు వారిలోని దృడ సంకల్పాన్ని నాయకత్వం లక్షణాలను పునికి పుచ్చుకుని గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. పూజ మాలార్పణ తో ప్రారంభమైన కార్యక్రమం, శాంతి పాఠంతో సంపన్నమైంది.






