NewsProgramms

శాస్త్రోక్తంగా వసంత పంచమి వేడుకలు

913views

దువుల తల్లి సరస్వతీ మాత జన్మ దినం వసంత పంచమిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలుచోట్ల వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని…

కర్నూలు జిల్లా నంద్యాల నగరంలో…

 

స్థానిక వై ఎస్సా ర్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలు సాంప్రదాయబద్దంగా జరిగాయి. స్థానిక అర్చకులు వేద మంత్రాలతో సరస్వతీ మాతను అర్చించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు.

సదరు కార్యక్రమంలో ఆరెస్సెస్ విభాగ్ సంఘ్ చాలక్ డా. ఉదయం శంకర్, బిజెపి నాయకులు శ్రీ మేడా మురళీధర్, డాక్టర్ ఇంటి ఆది నారాయణ, యోగా మాస్టర్ శ్రీ నారాయణ, అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీమతి మరియమ్మ అతిథులుగా పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఆర్ ఎమ్ పీ  డాక్టర్ నాగరాజు 80 మందికి పైగా చిన్నారులకు పలకలు, ఆహుతు లందరికీ మిఠాయిలను అంద జేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ మురళీకృష్ణా రెడ్డి, శ్రీ తిరుపతయ్య, శ్రీ శివజ్ఞాన ఆనందశర్మ, మాతృమూర్తులు, స్థానిక పెద్దలు పాల్గొన్నట్లు కార్యక్రమ సంయోజకులు శ్రీ రంగయ్య తెలియజేశారు.

విశాఖ జిల్లా అనకాపల్లిలో….

అలాగే విశాఖ జిల్లా అనకాపల్లిలోని మాధవ విద్యా విహారలో వసంతపంచమి సందర్భంగా నిర్వహించిన సరస్వతి హోమంలో అనకాపల్లిలోని ఎన్. జీ రంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల సూపరింటెండెంట్ శ్రీ నంబారు రామకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11 మంది విద్యార్థులకు అక్షరాబ్యాసం చేయించారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో…

మాధవ సేవాసమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని RSS కార్యాలయంలో వసంతపంచమి సందర్భముగా సరస్వతి పూజ జరిగింది.ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ సహ ప్రాంత కార్యవాహ శ్రీ యుగంధర్ పాల్గొని బాలబాలికలకు ఆశీర్వాదం అందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.