
అయితే అలోక్ కుమార్ ప్రస్తుతం హిందూ సవాళ్ల గురించి మాట్లాడుతూ.. సాధు సంతులు కొన్ని విషయాల్లో హిందూ సమాజానికి మార్గదర్శనం చేయాలని కోరారు. ముఖ్యంగా…
2. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మత మార్పిళ్లను అరికట్టడానికి ప్రతిభావంతమైన చర్యలు తీసుకోవాలి.
3. దేశ వ్యాప్తంగా మత స్వేచ్ఛా చట్టాన్ని ఏకరూపకంగా అమలు చేయాలి.
4. దేశంలో పెరుగుతున్న జిహాదీ మనస్తత్వం, తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు
5.సరిహద్దు ప్రాంతాలలో పెరుగుతున్న సామాజిక సమస్యలు మరియు మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారాలు.
6. రాబోయే జనాభా లెక్కల్లో హిందువులు అందరూ తమ మతం దగ్గర హిందూ అని రాయించాలి.
అఖిల భారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి పూజ్య స్వామి జితేంద్రానంద సరస్వతి జీ మాట్లాడుతూ నేడు కొన్ని గ్రూపులు జిహాద్‌ను, తీవ్రవాద మనస్తత్వాన్ని సమర్థించే సాహసం చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే ఢిల్లీ ఉగ్రదాడి నిందితులకు మద్దతిచ్చే ధోరణి చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు. పార్లమెంట్ వేదికగా కఠినమైన, ప్రభావవంతమైన చట్టాలను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ హస్తాల నుంచి దేవాలయాలను విముక్తి చేయాలని, దీని అవసరం ఎంతో వుందన్నారు.

ఇక.. బెంగాల్ నుంచి వచ్చిన సాధువులు బెంగాల్ లో దారుణమైన పరిస్థితులు వున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు బహిరంగంగా చేస్తున్న జిహాదీ ప్రకటనలు, హిందువులపై బెదిరింపులు, దౌర్జన్యాలు అనేవి కేవలం బెంగాల్ కి మాత్రమే కాకుండా మొత్తం దేశానికే హెచ్చరిక లాంటివి అని అన్నారు.
ఇక.. సుధాంశు జీ మహారాజ్ మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర నిర్మాణ ఉద్యమం, తపస్సు గురించి లోతుగా ప్రస్తావించారు. భారత దేశ నిజమైన శక్తి సాధు సంతులేనని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గురుకులాలు, అర్చక సంప్రదాయాలు, ఆశ్రమాలు, సంస్కార కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో పూజ్య జగద్గురు స్వామి రామ్ కమలాచార్య జీ, అటల్ పీఠాధీశ్వర్ పూజ్య స్వామి విశ్వాత్మానంద సరస్వతి జీ మహరాజ్, ఆచార్య మహామండలేశ్వర పూజ్య స్వామి విశోకానంద జీ మహారాజ్, పూజ్య స్వామి వివేకానంద జీ మహరాజ్,గీత మనీషి జ్ఞానానంద్ జీ మహారాజ్, అఖిల భారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి పూజ్య స్వామి జితేంద్రానంద సరస్వతి జీ మహరాజ్, వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు శ్రీ ఓంప్రకాష్ సింఘాల్, పోషకుడు దినేష్ చంద్ర, జాయింట్ జనరల్ సెక్రటరీ వినాయక్ రావు, కేంద్ర మంత్రి శ్రీ అశోక్ తివారీ తదితరులు పాల్గొన్నారు.





