News

మసీదులో లౌడ్ స్పీకర్ల హక్కును డిమాండ్ చేయలేరు : బాంబే హైకోర్టు

149views

మసీదులో ప్రార్థనల కొరకు లౌడ్‌స్పీకర్ వినియోగం, హక్కు అని డిమాండ్ చేయలేరని బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ స్పష్టంగా చేసింది. గోండియా జిల్లాలోని మస్జిద్ గౌసియాలో ప్రార్థనల కొరకు లౌడ్‌స్పీకర్ వినియోగించడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అనిల్ పాన్సారే, జస్టిస్ రాజ్ వాకోడే తో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.

ఏ మతం కూడా లౌడ్‌స్పీకర్ వినియోగాన్ని మతపరమైన బాధ్యతగా పేర్కొనలేదు, లౌడ్‌స్పీకర్ తో ప్రార్థనలు చేయాల్సిందే అని నిరూపించే ఆధారాలు లేవు. కాబట్టి లౌడ్‌స్పీకర్ అనుమతి కోరటానికి ‘హక్కు’ లేదని కోర్టు తేల్చిచెప్పంది. ప్రార్థనలు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా చేయాలని ఏ మతం చెప్పదు. వాయిస్ యాంప్లిఫయర్లు వినియోగించాల్సిందే అని కూడా ఏ గ్రంథం చెప్పదు అని సుప్రీంకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది.

ఇప్పటికీ అనేక మసీదులలో ఉన్నటువంటి లౌడ్ స్పీకర్ల వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉంటున్నటువంటి జనావాసాలు, హాస్పిటల్, స్కూల్, కాలేజీలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాయి. వీటి పైన కూడా త్వరలో యాక్షన్ తీసుకోవాల్సిందని ప్రజలు కోరుకుంటున్నారు.