News

రామ మందిర మ్యూజియానికి యూపీ కేబినెట్ ఆమోదం… టాటా కి అప్పగింత

159views

అయోధ్య రామ మందిర మ్యూజియం ప్రాజెక్ట్ విస్తరణకి యూపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తయారు చేయాలని దీనిని టాటా సన్స్ కి కూడా అప్పగించింది.దీంతో అయోధ్య సాంస్కృతిక దృశ్యం కూడా మారిపోనుంది. ఈ నిర్ణయం అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గమ్యస్థానంగా మార్చడంలో కీలకంగా మారనుంది.
మ్యూజియం అభివృద్ధికి భూ కేటాయింపు పద్ధతులను సుస్థిరం చేస్తూ, కేంద్రం, యూపీ ప్రభుత్వం, టాటా సన్స్ మధ్య 2024, సెప్టెంబర్ 3 న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దీని ప్రకారమే కేబినెట్ ప్రస్తుతం ఆమోదం లభించింది.

టాటా సన్స్ లాభాపేక్ష లేని స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) కింద ఈ మ్యూజియాన్ని నిర్మించి, నిర్వహించనుంది.కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద సృష్టించబడిన ఈ SPVలో కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు కంపెనీ ప్రతినిధులు ఉంటారు. డిజైన్, టెక్నాలజీ మరియు సాంస్కృతిక మౌలిక సదుపాయాలలో తమ నైపుణ్యాన్ని CSR కిందకు తీసుకురావడానికి టాటా సన్స్ సంసిద్ధతను వ్యక్తం చేసిందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.,

ప్రారంభంలో మంఝా జంథారాలోని 25 ఎకరాల నాజుల్ భూమిలో ఈ మ్యూజియం ప్రణాళికను వేశారు. టాటా సన్స్ కి వున్న అనుభవాన్ని రంగరించి, ఓ బ్లూ ప్రింట్ ను తయారు చేసింది. దీనికి అనుగుణంగానే నడుస్తోంది.గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళిక విభాగం నుండి పర్యాటక శాఖకు అదనంగా 27.102 ఎకరాలు ఉచితంగా బదిలీ చేయనుంది. మొత్తం ఈ ప్రాజెక్టు 52.102 ఎకరాలకు చేరుకుంటుంది.