
248views
హిందూ బంధువుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరరావును పెడన పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా పెడన గ్రామ దేవత పైడమ్మ తల్లి ఉత్సవాల్లో వివిధ హక్కులకు వేలం పాటల నిర్వహణ, హిందూ ఆలయం షాపుల వేలం పాటలో ఇతర మతస్తులు ప్రమేయాన్ని ప్రశ్నిస్తూ, ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ పై కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు పెడనలోని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని ఆయన నివాసం నుంచి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న బిజెపి నేతలు, ఐక్యవేదిక ప్రతినిధులు పోలీసు స్టేషన్ కు చేరుకుని నిరసన తెలిపారు. అరెస్టుపై రూరల్ సీఐ నాగేంద్ర ప్రసాద్, పెడన ఎస్సై గంట్ల సత్యనారాయణలను ప్రశ్నించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో కోటేశ్వరరావును బయటకు విడిచిపెట్టారు.





