News

CAA వ్యతిరేక ర్యాలీల్లో బంగ్లా జాతీయులు

648views

CAA కి నిరసనల పేరుతో కొందరు మన దేశంలో సమస్యలు సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పర్యాటక వీసా మీదనో, విద్యార్థి వీసా మీదనో మన దేశానికి వచ్చిన కొంతమంది విదేశీ పౌరులు CAA వ్యతిరేక ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఇలాంటి ర్యాలీ లో పాల్గొన్న ఒక జర్మన్ విద్యావేత్తకి మనం దేశ బహిష్కరణ విధించాము. CAA కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న చాలా పాకిస్తానీ ట్విటర్ హ్యాండిల్స్ ని కనుగొన్నారు. తాజాగా ఒక బంగ్లాదేశీ విలేఖరి కోల్ కత్తా లో CAA వ్యతిరేక ర్యాలీ లో పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. కానీ దీని గురించి బెంగాల్ పోలీసుల దగ్గర సమాచారం లేదు.

బంగ్లాదేశ్ లోని ఖుల్నా కి చెందిన షేక్ నూర్ ఆలం తాను ర్యాలీ లో పాల్గొన్న ఫోటోలను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసాడు. దానితో చాలా మంది నెటిజనులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ లో అతను ఎలా పాల్గొంటాడు అని ప్రశ్నిస్తూ ఆ పోస్ట్ ని వైరల్ చేశారు. అతను మన దేశంలోకి టూరిస్ట్ వీసా మీద వచ్చాడా, లేక ఇంకేవన్నా అక్రమ మార్గాల ద్వారా వచ్చాడా అన్న ప్రశ్నలు సంధించబడ్డాయి. టూరిస్ట్ వీసా మీద ఈ దేశానికి వచ్చిన వారెవరూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఎటువంటి కార్యకలాపాలలో పాలు పంచుకోకూడదు.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ (LRO ) నూర్ ఆలం CAA వ్యతిరేక పాల్గొన్న విషయం, చేతిలో ‘మోడీ గో బ్యాక్ ‘ అన్న ప్లకార్డు ను పట్టుకున్న విషయం పై జనవరి 12 న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA )కి ఫిర్యాదు చేసింది. ఆ విలేకరి మీద సత్వరం విచారణ జరిపి, అతనిని ఈ దేశం నుండి బహిష్కరించామని LRO ఆ ఫిర్యాదులో విదేశాల మంత్రిత్వ శాఖను అభ్యర్ధించింది. ఈ మేరకు LRO కోల్ కత్తా నగర పోలీస్ కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేసి, దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న నూర్ ఆలం ని వెంటనే గుర్తించి, విచారణ చేసి, ఈ దేశం నుండి బహిష్కరించే విధంగా చర్యలు తీసుకొమ్మని ఆ ఫిర్యాదులో కోరింది. నగర పోలీసు కమిషనరు ఈ ఫిర్యాదు మీద ఇంకా స్పందించవలసి ఉంది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.