News

గోవులను వదించే సంస్కృతి మంచిది కాదు

181views

శ్రీకాకుళం జిల్లాలోని పవిత్ర శ్రీకూర్మ క్షేత్రంలో కూర్మాలు, సింహాచలంలో గోవులను చంపే సంస్కృతి మంచిది కాదని గోవా గవర్నర్‌, శ్రీకూర్మనాథాలయం ధర్మకర్త పూసపాటి ఆశోకగజపతిరాజు అన్నారు. శ్రీకూర్మనాథాలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త హోదాలో ఆయన పాల్గొన్నారు. గవర్నర్‌ మాట్లాడుతూ సభ్యులు దైవ సేవ చేసేందుకే వచ్చామని భావించాలని, దేవునికి బాధ్యతతో పనిచేయాలన్నారు. చట్టరీత్యా ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేశారన్నారు. దేవస్థానంలోని ఆకుపసర చిత్రాలు (మ్యూరల్స్‌) వేసిన పూర్వీకుల నైపుణ్యాలను భావితరాలకు అందించాల్సి ఉందన్నారు.

అనంతరం స్వామిని దర్శించుకొని ఆలయంలో రాతి స్తంభాలు, ఆకుపసర చిత్రాలు, కాశీద్వారం పరిశీలించారు. శాలిహుండం బౌద్ధారామాలను సందర్శించి, కొండపై ఉన్న ఆరామాలను పరిశీలించారు.