News

‘‘లవ్ జిహాద్’’ నుంచి హిందూ అమ్మాయిలను కాపాడుకోవాలి

204views

దేశంలో జరుగుతున్న లవ్ జిహాద్ పై జైన్ సన్యాసి కార్యశిరోమణి విదిత్ సాగర్ జీ మహారాజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ తో హిందూ సమాజానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందన్నారు. దీనిపై హిందువులు, హిందూ సంస్థలు అప్రమత్తంగా వుండాలని, దేశ సంస్కృతిని, సామాజిక వ్యవస్థను రక్షించాలని పిలుపునిచ్చారు. కర్నాటకలోని భగవాన్ నేమినాథ్ దిగంబర్ జైన్ టెంపుల్ వద్ద జరిగిన 7వ దీక్షా మహోత్సవం జరిగింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కార్యశిరోమణి విదిత్ సాగర్ జీ మహారాజ్ మాట్లాడుతూ విదేశీ ప్రభావాల ద్వారా భారతీయ మహిళలపై మోసపూరిత చర్యలు జరుగుతున్నాయన్నారు.మన దేశంలో విదేశీయులు రకరకాల చర్యలు చేస్తున్నారని, వాటిలో లవ్ జిహాద్ భాగమని ప్రకటించారు. ఏది తప్పో, ఏది ఒప్పో అని హిందూ యువతుల మనస్సులకు తెలియడం లేదని, దీంతో మతం మార్చేస్తున్నారని, చాలా మంది డబ్బు, బంగారం, ఇతర భౌతిక ప్రలోభాలతో విదేశాలకు తీసుకెళ్తున్నారన్నారు.

భారతీయ సమాజం ఎప్పుడూ మహిళలను, ధర్మం, సంస్కృతిని వాహకాలుగా చూస్తుందని, డబ్బు కోసం, బాలికలను విదేశాల వారికి అమ్మేయడం మన సంస్కృతి కాదని హెచ్చరించారు. హిందూ మతాన్ని, హిందూ ఆడ పిల్లలను కాపాడుకోవాలని, మన హిందువులతోనే వారికి వివాహం చేయాలని నొక్కిచెప్పారు. ఈ విధంగా మన మతాన్ని కాపాడుకుంటూ బలమైన దేశాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.

ప్రపంచం మొత్తానికి భారత్ ఓ దేవాలయం లాంటిదని, అంత గౌరవంగా మన దేశాన్ని విదేశీయులు చూస్తారన్నారు. కులం, మతం, వర్గాలతో సంబంధం లేకుండా అహింసను అనుసరించే వారందరూ ఐక్యంగా వుండాలని పిలుపునిచ్చారు.

‘‘మహిళలను దోపిడీ చేసే మరియు సామాజిక ఐక్యతను బలహీనపరిచే చర్యలతో భారతదేశ సాంస్కృతిక పునాది ముప్పును ఎదుర్కొంటోంది.లక్షలాది మంది భారతీయులు బయటి వ్యక్తుల చేతుల్లో మోసపోయారు, కానీ ప్రపంచానికి నిజానిజాలు తెలియకుండా కొందరు జాగ్రత్తపడుతున్నారు.ఇప్పటి నుండి, ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాలి మరియు అలాంటి మోసానికి బలైపోకుండా ఉండాలి. దురాశలను, ప్రలోభాలను తిరస్కరించాలి. భారతీయ విలువలను పరిరక్షించాలి’’ అని జైన సన్యాసి పిలుపునిచ్చారు.