
భారత సైనిక బలగాలను మట్టుబెట్టేందుకు పాకిస్థాన్ సరికొత్త కుట్రకు తెరలేపింది. సైనిక బలగాలకు అందించే ఆహారంలో విషం కలిపేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారని కేంద్ర ఇంటలిజెన్స్‌కు రహస్య సమాచారం అందింది. ఆ కుట్రను భారత భద్రతాబలగాలు భగ్నం చేశాయి. జమ్మూకశ్మీర్‌లో ఉన్న ఆర్మీ జవాన్లు తీసుకునే ఆహారం, తాగే నీళ్లలో విషం కలపాలని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు చేసిన హెచ్చరికలతో కేంద్ర భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలున్న నేపథ్యంలో భారత సైన్యం వాటిని నిశితంగా గమనిస్తోందని, పాక్ కుయుక్తులను తిప్పి కొడతామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే హెచ్చరించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.