
811views
పౌరసత్వ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగంగా చెప్పుకొచ్చారు. కేరళ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రులయితే ఏకంగా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ చట్టం అమలు విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఆన్ లైన్ ద్వారా పౌరసత్వం కల్పించే అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు చెక్ పెట్టొచ్చు. జిల్లా కలెక్టర్ల ద్వారా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని తీసుకువస్తే సీఏఏను ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలుపరచవచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరమే లేకుండా చేయొచ్చు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





