News

కేరళ జీహాదీలకు విదేశాల నుంచి భారీగా నిధులు

536views

కేరళ నుండి చాలా మంది ఐసిస్ కు వెళ్లడం, అక్కడ చనిపోవడం కూడా జరిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా కేరళలో పనిచేస్తున్న జిహాదీ గ్రూపులకు భారీగా విరాళాలు అందుతున్నాయి. ఆ విరాళాలు ఎక్కడ నుండి వస్తున్నాయా అని ఆరా తీసిన ఇంటెలిజెన్స్ కు షాకింగ్ విషయాలు తెలిశాయి. కేరళ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని జిహాదీ గ్రూపులకు దుబాయ్, టర్కీ దేశాల నుంచి ఈ నిధులు వస్తున్నాయట. ఒక జిహాదీ గ్రూపుకు చెందిన వ్యక్తి గత సెప్టెంబర్ నెలలో 9వ తేదీ నుంచి 19 తేదీ మధ్యలో దుబాయ్ వెళ్లగా అతనికి రూ 40 లక్షలు ఆఫర్ చేశారు. అక్టోబర్ 1న ఇతర గ్రూపులకు చెందిన వాళ్ళు కూడా దుబాయ్ కు వెళ్లగా టర్కీ, ఖతార్ దేశాల నుండి కావాల్సిన నిధులు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు తిరిగి వచ్చేసినట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి దేశంలోని జిహాదీ గ్రూపులకు అందుతున్న నిధులపై పూర్తి నివేదికను ఇవ్వాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. భారత్ లో అస్థిరత్వం నెలకొల్పడానికి.. అమాయకులను తీవ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేయడానికి ఈ గ్రూప్ లకు భారీగా నిధులు వస్తున్నాయి.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.