News

భక్త కన్నప్ప ఆవాసంలో వైభవంగా జరిగిన గురుపూజోత్సవం

232views

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలోని భక్తకన్నప్ప గురుకులం ఆవాసంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురష్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆవాస్ అధ్యక్షులు శ్రీ ఎం రఘురాం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విభాగ సంఘచాలక్ శ్రీ బి నీలకంఠేశ్వర్, ఆవాస కార్యదర్శి శ్రీ జి రఘు రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.

అనంతరం శ్రీ బి నీలకంఠేశ్వర్ మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ చాలా నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ఉన్నతమైన చదువులు చదివి వృత్తిరీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా సర్వేపల్లి ఉన్నతి పొందారని చెప్పారు. స్వశక్తితో అసాధారణ ప్రజ్ఞ పాటవాలతో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారని, ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం తెలిపారు. ఆయన నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి,విద్యార్థుల మధ్యనే గడిపారని ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఎదుటి వారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

శ్రీ జి రఘురామయ్య మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారని ఆయన ఉపాధ్యాయుని బాధ్యత నిర్వర్తించి గురుతరమైన ఉద్యోగానికి తలమానికంగా నిలిచారని చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నతమైన వ్యక్తిత్వం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు

అనంతరం ఆవాస విద్యార్థులు శ్రీ కే నాగేశ్వరరావు రిటైర్డ్ ఎంఈఓ గారిని, శ్రీ బి శంకర్ సింగ్ రిటైర్డ్ టీచర్, శ్రీ సి చంద్రశేఖర్ గార్లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆవాసం యొక్క కమిటీ మెంబర్స్ మరియు ఆవాస బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.