News

వనవాసీ హిందూ శరణార్థి కుమార్తెపై ఇస్లామిక్ మూకల సామూహిక అత్యాచారం

188views

ఇరవై ఐదేళ్ల క్రితం పాకిస్తాన్ లో ముస్లిం మతం స్వీకరించాలని మౌల్వీలు ఒత్తిడి చేస్తే వారి ఒత్తిళ్లకు లొంగక భారతదేశం వచ్చిన ఓ పాకిస్థాన్ శరణార్థి కుటుంబం, వార కుమార్తెను ఇస్లామిక్ దురాక్రమణ వల్ల కోల్పోపవలిసి వచ్చింది. ఏ కారణం చేతనైతే వారు భారతదేశానికి తిరిగి వచ్చారో ఆ కారణం వల్లనే వారి ఇంటి ఆడబిడ్డ కష్టాలపాలైంది.

ఇరవైఐదు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ లోని పంజాబ్ లో రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో పుట్టి పెరిగిన భిల్ కమ్యూనిటీకి జలాల్ రామ్ అక్కడే ఒక చిన్న ఎంబ్రాయిడరీ దుకాణం నడిపేవారు. స్థానిక మౌల్వీ రషీద్ఖాన్ తన రేడియోలో భజనలు వింటున్నందుకు ఎగతాళి చేసి, అతన్ని ఇస్లాం మతం స్వీకరించమని బలవంతం చేశాడు. జలాల్ దాన్ని తిరస్కరించడంతో మౌల్వీ అతన్ని బెదిరించాడు.. అక్కడే హిందూ భిల్ కమ్యూనిటి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ అక్కడ మౌల్వీ అతన్ని బెదిరించడం ఆపలేదు.

దాంతో 1999 అతను హిందువుగానే ఉంటానని చెప్పి తోటి యువ హిందూయువకులతో టూరిస్టు వీసా అప్లై చేశాడు. 2000 లో వీసా వచ్చింది. అతను తన కుటంబంతో పాటుగా మనదేశానికి వచ్చాడు. జైసల్మేర్ లో తన జీవితాన్ని ప్రారంభించాడు.. ఇదంతా ఇరవైఅయిదు సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటివరకు అతను పాకిస్తాన్ వెళ్లలేదు. అయితే అదే ఘటన తిరిగి పునరావఈతం అయింది. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఇటీవలే వివాహం చేసుకున్న అతని పెద్ద కుమార్తెను వలస కార్మికుల ముఠా కిడ్నాప్ చేసి లైంగింకంగా వేధించారు. మతం మారమంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు ఓ ముస్లిం యువకులు.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దాఖలు చేసిన FIRలో నిందితులను మహమ్మద్ ఫజల్, మహమ్మద్ సబీర్ ,మహమ్మద్ ఖుర్బాన్ గా పేర్కొన్నారు . ఇందులో మహ్మద్ ఫజల్ అనే వ్యక్తి ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచి ఆమెను వేధిస్తున్నాడు, తనతో పారిపోయి మతమార్పిడి-నిఖా చేయించుకోవాలని పదే పదే ఒత్తిడి చేశాడు.

మైనర్‌గా ఉన్నప్పటికీ, అతను ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె నిరంతరం నిరాకరించి తన సమాజంలోనే వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఆమెను కిడ్నాప్ చేసి మరీ లైంగికంగా వేధించారు వారు. వారందరిపై లైంగిక వేధింపుల కేసు, మతమార్పిడి చట్టం, మైనర్ లైంగిక దాడి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంలో పోలీసులు షబ్బీర్ , ఖుర్బాన్‌లను అరెస్టు చేయగా, ప్రస్తుతం ఫజల్ పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతన్ని కూడా పట్టుకుని బాధితురాలికి త్వరితగతిన న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.