News

ఆపరేషన్ సిందూర్ ఓనం ముగ్గు… 27 మందిపై కేసులు నమోదు

275views

కేరళలో ఓనం వేడుకల్లో నేలపై పూల అలంకరణ చాలా ప్రత్యేకమైనది. దాన్నే పూక్కలం అంటారు. ఇది తప్పనిసరిగా మలయాళీలు ప్రతిఇంటిలోనూ జరుపుకుంటారు. అయితే ఈ విషయంలో కూడా అక్కడ పాలక సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) వివాదాస్పదం చేయాలని చూస్తుంది.

సెప్టెంబర్ 5న కొల్లంలోని శాస్తంకోటలో ఆలయం ముందు పూక్కలం ఏర్పాటు చేసినందుకు 27 మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు సేవలందిస్తున్న సైనికుడు, మరొకరు మాజీ సైనికుడు.

పూక్కలం ఏర్పాటు చేసినందుకు ఎందుకు కేసు వేయడం అనుకుంటున్నారా వారు ఆపరేషన్ సింధూర్ థీమ్ తో పూక్కలం ఏర్పాటు చేశారు. శాస్త్రం కోట ముత్తుపిలక్కడ్ పార్ధసారధి ఆలయం ముందు ఈ థీమ్ తో పూక్కలం ఏర్పాటు చేసి, పూలతో కాషాయ జెండాను కూడా వేశారు. ఈ పూక్కలం వేసిన వెంటనే, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, యువకులను దానిని తొలగించమని కోరారు. వారు నిరాకరించడంతో, దానిని వెంటనే తొలగించకపోతే వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరించారు.

అయితే ఆ యువకులు వినలేదు. దాంతో పోలీసులు ఈ విషయంలో అల్లర్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయం కింద వారిద్దరితో పాటుగా, వారికి సహకరించిన మరో ఇరువై ఐదుమందిపై కూడా కేసు నమోదు చేశారు అధికారులు. పోలీసులకు, యువకులకు మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే చట్టపరమైన చర్యకు “ఆపరేషన్ సింధూర్” కారణమని చెప్పినప్పటికీ, FIRలో దాని గురించి ప్రస్తావించలేదు. బదులుగా, పూక్కళంలో అల్లర్లను ప్రేరేపించడానికి కాషాయ జెండా వేశారని రాశారు..కాగా రాజకీయ ప్రభావం వల్లే ఈ కేసు నమోదైందని ఆరోపణలు ఉన్నాయి. ఆలయ కమిటీలో సీపీఎం, కాంగ్రెస్ నాయకులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని అందుకే కేసు నమోదు చేశారని చెప్పుకుంటున్నారు.పోలీసుల అతిక్రమణకు వ్యతిరేకంగా వివిధ హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి.

బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూప్ ఆంటోనీ జోసెఫ్ మాట్లాడుతూ, “ఇది పాకిస్తాన్ కాదు; ఇది కేరళ, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ పాలనలో ఉంది. పువ్వులు కూడా దేశభక్తి సందేశాలను కలిగి ఉంటే వాటిని ముప్పుగా చూస్తారు” అని ఆయన అన్నారు. ఈ సంఘటనపై ఆ రాష్ట్ర పోలీసుల చర్యను బిజెపి కేరళ తీవ్రంగా ఖండించింది, ఎక్స్ లో ఇలా పేర్కొంది: ఇది పాకిస్తాన్‌లో జరిగితే, అది ఊహించి ఉండవచ్చు, కానీ భారతదేశంలో, ఇది దారుణం .ఆమోదయోగ్యం కాదు.

ఆపరేషన్ సింధూర్ అనేది భారత్‌కు గర్వకారణం, ఇది మన సాయుధ దళాల పరాక్రమానికి ప్రతీక. దీనిని లక్ష్యంగా చేసుకోవడం అంటే యూనిఫాం ధరించి, మన సరిహద్దులను కాపాడుతూ, త్రివర్ణ పతాకం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసే వేలాది మంది మలయాళీలతో సహా ప్రతి సైనికుడిని అవమానించడమే. అని పేర్కొంది. ఈ సంఘటనపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని , ఎఫ్ఐఆర్ ను ఉపసంహరించుకావలని డిమాండ్ చేసింది.