News

పాలస్తీనా దేశపు జెండాలను ప్రదర్శించిన నలుగురు అరెస్టు

129views

మిలాద్‌ – ఉన్‌ – నబీ సందర్భంగా శుక్రవారం కాకినాడలో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలో కలకలం రేగింది. మహ్మద్‌ ప్రవక్త 1500వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలోకి నాలుగు కార్లు చొరబడ్డాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ, ర్యాష్‌గా వాటిని నడపడంతో పలువురు కొంతమంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొంత దూరం వెళ్లాక, నాలుగు కార్ల నుంచి నలుగురు వ్యక్తులు పాలస్తీనా దేశపు జెండాలను ప్రదర్శించి మత ఘర్షణలకు పురిగొల్పే చర్యలకు పాల్పడ్డారు. తక్షణమే అప్రమత్తమైన కాకినాడ వన్‌ టౌన్‌ పోలీసులు వాహనాలను అడ్డుకొని ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మూలాలపై ఆరా తీస్తున్నారు. దీనిలో కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు వన్‌ టౌన్‌ సీఐ నాగదుర్గారావు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

కార్లతో హల్ చల్ చేసిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4కార్లను సీజ్ చేశారు. ఈనెల 5న మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నా థపురం మసీదు వద్ద నిర్వహించిన ర్యాలీలో కొందరు పాక్, పాలస్తీనా జెండాలతో కవ్వించారు. దీనిపై స్థానికుల ఫిర్యాదు మేరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.