News

వేడుకగా విశ్వరూప పాదయాత్ర

183views

కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, సత్యచంద్ర సరస్వతి స్వామివార్ల విశ్వావసు నామ సంవత్సరం చాతుర్మాష్య దీక్ష విరమణ సందర్భంగా కంచి మఠ స్వామీజీల ఆధ్వర్యంలో మఠ భక్తులు తిరుపతి నగరంలో విశ్వరూప యాత్ర వేడుకగా చేపట్టారు. కంచి మఠం మహాపాదుకా మండపం నుంచి దివ్యారామం ఉద్యానవనం వరకు ఈ విశ్వరూప పాదయాత్ర సాగింది. అనంతరం అక్కడ కంచి మఠాధిపతులు శ్రీభగవద్గీతలోని విశ్వరూప దర్శనయోగ అధ్యాయనాన్ని పఠించారు. అనంతరం స్వామివారు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. కార్యక్రమంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి, ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీ ఉపకులపతి రాణి సదాశివమూర్తి, నగరంలోని పలువురు ప్రముఖులు, మఠం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.