News

హిందువులపై దాడికి నిరసనగా బంద్ కార్యక్రమం

224views

ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కంచికచర్లలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందువులపై దాడికి నిరసనగా బంద్ కార్యక్రమం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఈనెల 6న వినాయకుడి విగ్రహం నిమజ్జనోత్సవం సందర్భంగా స్థానిక ఎస్సీ కాలనీ చర్చి వద్ద హిందువులపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీనికి నిరసనగా నిరసన చేపట్టారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామం వద్ద నుంచి కంచికచర్ల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య పరిటాల కంచికచర్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.