News

బ్రిక్స్ వర్చువల్ మీట్‌కు భారత్ తరఫున జైశంకర్

174views

ప్రపంచ దేశాలపై అమెరికా సుంకాల వల్ల ఏర్పడిన వాణిజ్య అసమానతలపై బ్రిక్స్ దేశాలు చర్చలు జరపనున్నాయి. వర్చువల్‌గా ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లూలా డా సిల్వ పిలుపునిచ్చారు. ఈ చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్ సుంకాలను ఎలా డీల్ చేయాలనే విషయంలో ఒక వధానాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ మీటింగ్ నిర్వహించనున్నట్లు ప్రస్తుత బ్రిక్స్ చైర్మన్‌గా ఉన్న బ్రెజిల్ చెప్పింది.

బ్రిక్స్ చైర్మన్ బ్రెజిల్ సెప్టెంబరు 8న వర్చువల్ మీటింగ్‌కు పిలుపునిచ్చారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు. లీడర్స్ స్థాయిలో జరిగే ఈ సమావేశంలో భారత్ తరఫున జైశంకర్ పాల్గొంటారని తెలియజేశారు. కాగా, భారత్‌పై యూఎస్ 50 శాతం సుంకాలు వేయాలని నిర్ణయించిన సమయంలోనే ప్రధాని మోడీకి ప్రెసిడెంట్ లూలా కాల్ చేశారు. భారత్‌కు తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.