
సోషల్ మీడియాలో పాపులారిటీ, వ్యూస్ సంపాదించడం కోసం కొందరు చేసే పనులు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ సోషల్ మీడియా పాపులారిటీ వేటలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా తప్పులు చేస్తున్నారు. వీడియోల కోసం ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లి వివాదాలకు కారణమవుతున్నారు. కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ దేవస్థానం వద్ద ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తన ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం చేసిన పని తీవ్ర వివాదాలకు కారణమైంది
మలయాళం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన జాస్మిన్ జాఫర్ ఇటీవల గురువాయూర్ ఆలయానికి వెళ్లింది. ఆ ఆలయంలో ఉండే పవిత్ర కొలనులో తన కాళ్లను కడుక్కుంటూ వీడియో తీసుకుంది. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ ఆలయ సాంప్రదాయం ప్రకారం.. విగ్రహామూర్తులకు ఈ పవిత్ర కొలనులో స్నానం చేయిస్తుంటారు. ఈ కొలనులోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి లేదు. ఆ విషయం తెలియక జాస్మిన్ జాఫర్ ఆ కొలనులో తన కాళ్లు కడుక్కుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
Andhrajyothy
తాజా వార్తలుచిన్న వీడియోలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంక్రీడలుచిత్రజ్యోతినవ్యసంపాదకీయంబిజినెస్ఆరోగ్యం
ePaperవెబ్ స్టోరీస్సాంకేతికంప్రవాసచదువుప్రత్యేకంక్రైమ్ వార్తలు
Share News
HOME » NATIONAL » INFLUENCERS REEL AT GURUVAYUR TEMPLE SPARKS CONTROVERSY, TRIGGERS PURIFICATION DRIVE SGR SPL
Guruvayur temple news: బిగ్‌బాస్ కంటెస్టెంట్ చేసిన అపచారం.. గురువాయూర్ ఆలయం సంప్రోక్షణకు నిర్ణయం..
ABN , Publish Date – Aug 26 , 2025 | 05:04 PM
సోషల్ మీడియాలో పాపులారిటీ, వ్యూస్ సంపాదించడం కోసం కొందరు చేసే పనులు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ సోషల్ మీడియా పాపులారిటీ వేటలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా తప్పులు చేస్తున్నారు. వీడియోల కోసం ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లి వివాదాలకు కారణమవుతున్నారు.
Guruvayur temple news: బిగ్‌బాస్ కంటెస్టెంట్ చేసిన అపచారం.. గురువాయూర్ ఆలయం సంప్రోక్షణకు నిర్ణయం..
Influencers Reel at Guruvayur Temple Sparks Controversy
సోషల్ మీడియాలో పాపులారిటీ, వ్యూస్ సంపాదించడం కోసం కొందరు చేసే పనులు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ సోషల్ మీడియా పాపులారిటీ వేటలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా తప్పులు చేస్తున్నారు. వీడియోల కోసం ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లి వివాదాలకు కారణమవుతున్నారు. కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ దేవస్థానం వద్ద ఓ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తన ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం చేసిన పని తీవ్ర వివాదాలకు కారణమైంది (influencer controversy).
ABN ఛానల్ ఫాలో అవ్వండి
మలయాళం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన జాస్మిన్ జాఫర్ (Jasmin Jaffar) ఇటీవల గురువాయూర్ ఆలయానికి వెళ్లింది. ఆ ఆలయంలో ఉండే పవిత్ర కొలనులో తన కాళ్లను కడుక్కుంటూ వీడియో తీసుకుంది. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ ఆలయ సాంప్రదాయం ప్రకారం.. విగ్రహామూర్తులకు ఈ పవిత్ర కొలనులో స్నానం చేయిస్తుంటారు. ఈ కొలనులోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి లేదు. ఆ విషయం తెలియక జాస్మిన్ జాఫర్ ఆ కొలనులో తన కాళ్లు కడుక్కుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది (temple reel backlash).
ఈ వీడియోను వీక్షించిన ఆలయ అర్చకులు జాస్మిన్‌పై మండిపడ్డారు. జాస్మిన్ చేసిన పని వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని భావించి, మంగళవారం నుంచి ఆరు రోజుల పాటు శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ రోజుల్లో ఆలయంలో భక్తుల దర్శనాలపై కూడా ఆంక్షలు విధించారు. ఆలయ నిబంధనలను ఉల్లంఘించినందుకు జాస్మిన్ జాఫర్‌పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై జాస్మిన్ స్పందించింది. క్షమాపణలు వేడుకుంది. తనకు ఆ ఆలయ సాంప్రదాయలు తెలియకపోవడం వల్లే ఆ తప్పిదం జరిగిందని, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చింది.





