News

భక్తులకు అందుబాటులోకి వచ్చిన తిరుమల పుష్కరిణి.

217views

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల ముందే స్వామివారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మ‌తు పనులు పూర్తయి కొత్త హంగులతో స్వామి పుష్కరిణి భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. మర‌మ్మ‌తు పనులను టీటీడీ జూలై 20 న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్వామివారి పుష్కరిణి లోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్ విభాగంలోని దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ రంగులు అద్దకంతో మరింతగా ఆకట్టుకుంటుంది. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణిని నింపిన టిటిడి అధికారులు ఈ మేరకు మర‌మ్మ‌తు పనులు పూర్తిచేశారు. స్వామి పుష్కరిణి మరమ్మ‌తు ప‌నుల‌ తో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీటీడీ నిలిపి వేసింది. ఇక భక్తులను సైతం నెల రోజులపాటు స్వామి వారి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. మరమత్తు పూర్తి కావడంతో ఈ రోజు నుంచి పుష్క‌రిణీలోకి టిటిడి భక్తులను అనుమ‌తించింది.