
వినాయక చతుర్థి సందర్భంగా మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిక్షించాలని ప్రజలకు అనంతపురం జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘మట్టి ప్రతిమలను పూజించి– పర్యావరణాన్ని పరిరక్షించాలి’ అనే పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. సహజ రంగులతో చేసిన మట్లి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకోవాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకూడదన్నారు. జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గించడం లేదా పూర్తిగా మానేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, ఏపీపీసీబీ పర్యావరణ ఇంజినీరు పీవీ కిషోర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.





