News

ఢిల్లీ నిజాముద్దీన్‌లో విషాదం.. కూలిన దర్గా పైకప్పు.. ఏడుగురు దుర్మరణం

182views

ఢిల్లీలో నిజాముద్దీన్‌ ఏరియాలో దర్గా పై కప్పు కూలి పలువురు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం సాయంత్ర సమయంలో చోటు చేసుకుంది. నిజాముద్దీన్‌ప్ ప్రాంతంలోని హుమయూన్‌ సమాధ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.

మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. దర్గా శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ సహాయక చర్యలు చేపట్టింది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యటు చేపట్టారు. శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ చర్యలు చేపట్టింది.