
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే తాజాగా పాకిస్థాన్‌లోని ఓ రైలుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రోలింగ్‌కు గురి అవుతుంది. పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి పెషావర్ పరుగులు తీసే ‘ఆవామ్ ఎక్స్‌ప్రెస్’ అనే రైలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే దీనికి కారణం.. ఈ రైలులోని దయనీయ పరిస్థితి. వైరల్‌గా మారిన వీడియోలో ఈ రైలు ఎంత దారుణ స్థితిలో ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. రైలులో ప్రయాణికులు ఉన్నా కానీ అక్కడికి పరిస్థితిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
వీడియోలో మొదట రైలులో కూర్చున్న ప్రయాణికులు కనిపిస్తారు. అయితే, కొన్ని సెకన్ల వ్యవధిలోనే అసలు విషయం బయటపడుతుంది. రైల్లోని బోగీల్లో కొన్ని సీట్లు తొలగించబడ్డట్టు కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల ఫ్లోర్ కూడా సరిగా లేదు. ఎందుకంటే చాలా చోట్ల మట్టి పెళ్లలకు సంబంధించి చెత్త భారీగా పేరుకుపోయి ఉంది. అంతేకాదండోయ్.. రైలు బాడీకి కూడా పెద్ద పెద్ద రంధ్రాలు కనిపిస్తున్నాయి. ఆ రంధ్రాల ద్వారా బయట ఏముందో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వీడియోను షేర్ చేయగా నిమిషాల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్ రైల్వే పరిస్థితిని హాస్యంగా ట్రోల్ చేస్తూ సెటైర్లు వేశారు. కొందరైతే.. పాకిస్తాన్ రైల్వే వ్యవస్థ ఎంత దారుణ స్థితిలో ఉందో ఈ ఒక్క వీడియో చాలు అంటూ కామెంట్ చేస్తుండగా.. యాత్రికుల భద్రత, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఇది చాటుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.





