ArticlesNews

‘‌కేరళ ముస్లిం ఆధిక్య రాష్ట్రం అయిపోతోంది!’

457views

కేరళను ఒకరి తరువాత ఒకరుగా పాలిస్తున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ ‌వారు ముస్లింలు ఆడమన్నట్టు ఆడతారని శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (ఎస్‌ఎన్‌డీపీ) యోగమ్‌ ‌ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ రాష్ట్రం 2040 నాటికి ముస్లిం ఆధిక్యంలోకి రావడం తథ్యమని హెచ్చరించారు. ఇది వాస్తవమే. కానీ ఎన్నికల ముందు ఇలాంటి వ్యాఖ్య బహిర్గతం కావడం ఆ రెండు బుజ్జగింపు బురదగుంటలకీ బాధగా ఉంది. ఉలిక్కిపడినట్టు నటిస్తున్నాయి. ముప్పయ్‌ ఏళ్లుగా యోగమ్‌ ‌కార్యదర్శిగా సేవలు అందిస్తున్న నటేశన్‌ను పలు సంస్థలు జూలై 19న సత్కరించాయి. ఈ సందర్భంగా ఆయన పచ్చి నిజాలు కక్కేశారు. అదంతా కేరళలో స్వైర విహారం చేస్తున్న ముస్లిం ఆధిపత్యం గురించే.

ప్రస్తుత కేరళ సీపీఎం ప్రభుత్వం కాంతాపురం ఏపీ అబూబకర్‌ ‌ముస్లియార్‌ ఏది చెబితే అది చేస్తున్నదని, ముస్లిం నాయకుల కనుసన్నలలో నడుస్తున్నదని ఎస్‌ఎన్‌డీపీ ప్రధాన కార్యదర్శి నటేశన్‌ ‌వ్యాఖ్యానించారు. ఎస్‌ఎన్‌డీపీ యోగమ్‌ అం‌టే కేరళలోని హిందూ ఎళవా కులానికి ప్రాతినిధ్యం వహించే బలీయమైన సంస్థ. సంఘ పరివారేతర నేత నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్య రావడం సంచలనంగా మారింది. జూలై 19న కొట్టాయంలో ఆ సంస్థ ఏర్పాటు చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ నటేశన్‌ ‌తన ఆందోళన బయటపెట్టారు. నిజానికి అది హిందువులందరి ఆందోళనకు అద్దం పట్టేదే. లెఫ్ట్ ‌డెమాక్రటిక్‌ ‌ఫ్రంట్‌ అయినా, యునైటెడ్‌ ‌డెమాక్రటిక్‌ ‌ఫ్రంట్‌ అయినా ముస్లింల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాయని ఆయన విమర్శించారు. న్యాయస్థానం ఆదేశం మేరకు రాష్ట్రంలో పాఠశాలల వేళలు మార్చారు. సంస్థా కేరళ జెమ్మియాతుల్‌ ఉలేమా (సంస్తా) దీనికి అభ్యంతరం చెప్పింది. ఓనమ్‌కీ, క్రిస్మస్‌కీ ఇచ్చే సెలవులను కుదించమని ఆదేశించింది. పాఠశాలల్లో విద్యార్థుల కోసం జుంబా నృత్యం ప్రవేశపెడితే కూడా సంస్తా వ్యతిరేకించింది. ప్రభుత్వం ఏదైనా చట్టపరంగా ప్రవేశపెట్టదలిస్తే అది మలప్పురం (ముస్లిం ఆధిపత్యానికీ, ఉన్మాదానికీ కేంద్రం) అనుమతితో జరగాలని, లేకుంటే సమస్యలు తలెత్తుతాయని నటేశన్‌ ‌వ్యంగ్యంగా చెప్పారు. బీసీల కోసం ఉద్దేశించిన పథకాలన్నింటినీ, బీసీ వర్గాల ప్రయోజనాలన్నింటినీ ముస్లింలు కబ్జా చేస్తున్నారని నటేశన్‌ ‌బాహాటంగానే ఆరోపించారు. మలప్పురం వారు కూర్చోమంటే వారు సాష్టాంగపడుతున్నారు. రాష్ట్ర ఎటువైపు పోతోంది? మత నియంతృత్వం వైపునకా? అని కూడా నటేశన్‌ ‌నిలదీశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ ‌గతంలోనే కేరళ ముస్లిం ఆధిక్య రాష్ట్రమవుతుందని హెచ్చరించిన సంగతిని గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో మలప్పురం జిల్లాలో అసెంబ్లీ స్థానాలు పెరగబోతుంటే, మిగిలిన చోట్ల తగ్గుతున్నాయని నటేశన్‌ ‌తెలియచేశారు. శాసనసభలో మళ్లీ ముస్లిం ఆధిపత్యమే పెరుగుతుంది. ఎళవా కులస్థులన• కేవలం ఉపాధి కల్పన పథకాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, ఇది ఆగాలని పిలుపునిచ్చారు. ఎళవా కులస్థులు ఏకమైతే కేరళను ఎవరు పాలించాలో శాసించగలం అని ఆయన అన్నారు. కొట్టాయంలో సంఘాల ఆధిపత్యం గురించి మాట్లాడుతూ ఇక్కడ కొన్ని సంఘాలు తమకు నచ్చిన వారిని ఎన్నికల బరిలో నిలబెడతాయని వారికి మనం ఓటు వేస్తామని మన హక్కుల ఏమిటో వెల్లడించే అవకాశమే లేదని చెప్పారు. తాను ఇక ముందూ సామాజిక న్యాయం గురించి, తమ వర్గం హక్కుల గురించి మాట్లాడుతూనే ఉంటానని, మైనారిటీల నుంచి వ్యతిరేకత వచ్చినా వెనుకాడనని ఢంకా బజాయించారు. తన దిష్టిబొమ్మలు ఎన్ని తగలేసినా లెక్క లేదని, ఈ విషయం గురించి చెబుతూనే ఉంటానని ప్రతిజ్ఞ చేశారాయన. ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనే నటేశన్‌ ‌హేతుబద్ధంగానే మరొక పెద్ద దుమారం లేపారు. మలప్పురం అనేది ప్రత్యేక దేశమైపోయిందంటూ అంతా చెప్పడానికి భయపడే సత్యాన్ని వెల్లడించారు. అది ఒక వర్గం రాజ్యమైందని, వెనుకబడిన తరగతుల వారు భయం భయంగా బతుకుతున్నారని చెప్పారు. మలప్పురం జిల్లాలోనే ఎళవా వర్గానికి ఒక్క పాఠశాల కూడా ఎందుకు లేదని నిలదీశారాయన. కేరళ ప్రాంతానికి చెందిన చరిత్ర ప్రసిద్ధమైన సంస్కర్త శ్రీనారాయణగురు స్థాపించిన సంస్థ ఎస్‌ఎన్‌డీపీ. ఇంతకీ ఈ సభలో రాష్ట్ర సహకార మంత్రి వీఎన్‌ ‌వాసవన్‌ ‌కూడా ఉన్నారు. మొదట ఆయన యోగమ్‌కు నటేశన్‌ అం‌దించిన సేవలను శ్లాఘించారు కూడా. ఆ సభలోనే పాల్గొన్న కేంద్రమంత్రి రాజీవ్‌ ‌చంద్రశేఖర్‌ ‌మాట్లాడుతూ, బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలుతున్నచోట నటేశన్‌ ‌తన వర్గం హక్కుల గురించి సాహసోపేతంగా పోరాడడం విశేషమని కుండబద్దలు కొట్టి చెప్పారు.

ముస్లింల మీద ఈగ వాలినా సహించలేరు మార్క్సిస్టులు. అందుకే నటేశన్‌ ‌పేరు ప్రస్తావించ కుండానే ఆ పార్టీ కేరళ శాఖ కారాలూమిరియాలూ (ఎళవా వర్గానికి కోపం రాకుండా) నూరింది. రాష్ట్ర సెక్యులరిస్టు సంస్కృతిని తక్కువ చేసి చూపించే వారి పట్ల యావన్మందీ అప్రమత్తంగా ఉండాలని కొన్ని గంటలలోనే ఒక ప్రకటన జారీ చేసింది. సీపీఎం ప్రభుత్వం అన్ని వర్గాలను సమంగానే చూస్తున్నదని పెద్ద అబద్ధం ఆడింది. సామాజిక న్యాయం, సెక్యులరిజం సీపీఎం ప్రభుత్వ మౌలిక విధానాలు కూడానట. అసలు సీపీఎం నారాయణగురు బోధనల ఆధారంగానే ప్రభుత్వాన్ని నడుపుతున్నదని కూడా పొల్లు మాటలు చెప్పింది. ఎవరైనా తమ వర్గం హక్కుల గురించి ప్రస్తావించడం తప్పు కాదని, కానీ అవతలి మతాన్ని విమర్శించడం సరికాదని సుద్దులు వల్లించింది. ముస్లింలకే పెద్ద పీట వేసి, తమ వర్గాన్ని అన్యాయం చేస్తున్నారంటూ నటేశన్‌ ‌వ్యాఖ్యానించడం, దానిని సీపీఎం వెంటనే ఖండించడం చూసి కాంగ్రెస్‌ ‌కూడా ఆలస్యం చేయలేదు. మైనారిటీ ఓట్లన్నీ సీపీఎం కొల్లగొట్టుకుపోతుందేమోనని కాంగ్రెస్‌ ‌భయం. కేరళ శాసనసభలో కాంగ్రెస్‌ ‌నేత, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్‌ ‌కూడా నటేశన్‌ ‌మీద దాడికి దిగారు. సమాజాన్ని విభజించే ఏ ప్రయత్నాన్నీ ప్రజలు అనుమతించరాదని వీరంగం వేశారు. నటేశన్‌ ‌వ్యాఖ్యలే ఎన్‌ఎన్‌డీపీ సిద్ధాంతాలకి వ్యతిరేకమని కూడా తేల్చేశారు. ఇలా సమాజాన్ని విడదీసే ప్రకటనలను కుల సంఘాల నాయకులు చేయరాదని ఆగ్రహించారు. సమాజాన్ని చీలికలు పేలికలు చేసే విధంగా మాట్లాడే హక్కు ఒక్క రాహుల్‌ ‌గాంధీకే ఉందన్నది కాంగ్రెస్‌ ‌వాళ్లందరి నిశ్చితాభిప్రాయం కదా! సీపీఎం, కాంగ్రెస్‌ ఇం‌త మద్దతు ఇచ్చి, నటేశన్‌ ‌భావ ప్రకటనా స్వేచ్ఛను ఇంతగా అణచి వేసేందుకు సమాయత్తమైపోతే, ముస్లిం లీగ్‌ ఎం‌దుకు చూస్తూ ఊరుకుంటుంది? ఇలాంటి వ్యాఖ్యలు ‘‘అవాంఛనీయం’’ అని లీగ్‌ ‌జాతీయ కార్యదర్శి పీకే కున్హాలీకుట్టీ అన్నారు. నటేశన్‌ ‌వ్యాఖ్యలను పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సర్కారుకు ఫత్వా జారీ చేశారు.

నటేశన్‌ ఇవాళ ఇలా బహిరంగ యుద్ధం ప్రకటించి ఉండవచ్చు. కానీ కేరళలో ముస్లింలు ఆడమన్న్టల్లా ఆడడమే కాదు, హిందూ మనోభావాలను కించపరచడం సీపీఎంకు నిత్య కృత్యమే. దానికి నిదర్శనం ఇటీవల గురుపూర్ణిమ సందర్భంగా కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలలో జరిగిన కార్యక్రమం మీద చైనా భక్తులు రేపుతున్న వివాదం. ఆ రోజున కొన్ని పాఠశాలల్లో గురువులకు పాదాభిషేకం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఇది సనాతన ధర్మంలో భాగం. శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. వేదకాలం నుంచి భారతీయ సమాజంలో కనిపించే గొప్ప సంప్రదాయం. తనకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో గౌరవ ప్రదమైన పౌరునిగా నిలిచే అవకాశం ఇచ్చినందుకు గురువు పట్ల విద్యార్థి చూపే కృతజ్ఞతకు అది ప్రతీకాత్మక చర్య. దీనిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా ముద్ర వేసి వీరంగం వేస్తున్నాడు. ఆ కార్యక్రమం మీద దర్యాప్తునకు కూడా ఆదేశించాడు. దిగుమతి చేసుకున్న మూర్ఖ సిద్ధాంతం ఇచ్చిన పిడివాదంతో బుర్రలు కుళ్లిన మార్క్సిస్టులు దీనిని విమర్శిస్తున్నారు. గురుపూజను బానిస మనస్తత్వానికి బీజం వేసే చర్యగా వ్యాఖ్యానిస్తున్నాడు పినరయి. ఇదంతా దేశ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నది. మార్క్సిస్టుల భేషజం గురించి, వారి హిందూ వ్యతిరేకత గురించి తెలిసిన వారు అక్షరాలా చీదరించు కుంటున్నారు. అయితేనేం! ఆ చీదరింపులు ఓట్లుగా మారితే అదే చాలు. కేరళ కాని, మరొకచోట గాని, మార్క్సిస్టులు స్థానీయతను కించపరచడమే వ్యూహంగా పెట్టుకున్నారు. పనిగట్టుకుని భారతీయ సనాతన ధర్మాన్ని ఎందుకు విమర్శించడం? తద్వారా మతోన్మాద ముస్లింల దురదకు ఉపశమనం కలిగించడం. గురుపూజ అంటే ఆధునికతకు బద్ధ శత్రువట. ఒకప్పుడు దేశాన్ని ముక్కలు చేద్దామని శతథా ప్రయత్నించిన మార్క్కిస్టులు ఇప్పుడు గురుపూజ వంటి ఆచారాలు సమాజాన్ని విడదీస్తాయని నీతులు చెబుతున్నారు.

మార్క్సిస్టులే అయినా కొందరిలో ఎక్కడో పిసరంత నిజాయితీ ఉంటుంది. అంతరాత్మ ఏదో క్షణంలో హెచ్చరిస్తుంది. వీఎస్‌ అచ్యుతానందన్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లవ్‌ ‌జిహాద్‌ ‌గురించి నిజాయితీగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు బహిరంగంగా చేసేవేనా? ముస్లిం సోదరుల మనసులు గాయపరచవా? అంటూ ఆనాడు చైనా భక్తులు ఆవేశపడ్డారు.

లవ్‌ ‌జిహాద్‌ ‌గురించి ఇప్పుడు అందరికీ క్షుణ్ణంగా తెలిసింది. అయినా చాలామంది ఇతర వర్గాల బుద్ధితక్కువ యువతీయువకులు ఆ రొచ్చులో దిగుతున్నారు, అది వేరే విషయం. అచ్యుతానందన్‌ అన్న మాటలలో ఎక్కడో సాంస్కృతిక పరిరక్షణ పట్ల సానుభూతి కనిపిస్తుంది. అలాగని అచ్యుతానందన్‌ ఎల్లవేళలా సద్బుద్ధితో వ్యవహరించారని అనడం పొరపాటు. బీజేపీని ఆయన మతతత్త్వ పార్టీ అనే అనేవారు. ఎందుకంటే, నిరంతరం లవ్‌ ‌జిహాద్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, పోరాడింది. నిజానికి లవ్‌ ‌జిహాద్‌ అన్నమాట కేరళ హైకోర్టులోనే పుట్టిందన్న సంగతి చాలామందికి తెలియదు. ఆ పదం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల సృష్టి కాదు. 2009లో అప్పటి కేరళ హైకోర్టు న్యాయమూర్తి కేటీ శంకరన్‌ ఈ ‌మాటను సృష్టించారు. అంతకు ముందు రాష్ట్రానికి ఉన్న మతాంతరీకరణల చరిత్రను బట్టి, దాని విపరిణామాలను బట్టి మాత్రమే న్యాయమూర్తి ఆ మాటను సృష్టించగలిగారు. ఆఖరికి తన సొంత సీపీఎం మూర్ఖత్వాన్ని భరించలేక అచ్యుతానందన్‌ ‌లవ్‌ ‌జిహాద్‌ ‌మీద వాళ్ల వైఖరిని నిరాకరించారు.

ఆలయాల విషయంలో మార్క్సిస్టులది అసహ్యకర, నీచ ధోరణే. ఏ మార్క్సిస్టు కార్యకర్తను కదిపినా హిందూ దేవుళ్లపై బూతులు లంఘించుకుంటాడు. దేవాలయాల భూములు పంచాలని కూస్తాడు. మిషనరీల భూములు, వక్ఫ్ ఆస్తుల గురించి నోరెత్తడు. కానీ హిందూ ఆలయాల సొమ్ము కమ్యూనిస్టు ప్రభుత్వం దిగమింగుతూనే ఉంది. దేవుళ్ల నైవేద్యాల ఖర్చును కూడా దారి మళ్లించి, సెక్యులరిజం గురించి జనాన్ని వాయిస్తూ ఉంటారు. ఈ విషయంలో మార్క్సిస్టుల జుగుప్సాకర వైఖరి దేశంలో చాలా రాజకీయ పార్టీలకు కూడా తీపిగానే ఉంది. కేరళ మార్క్సిస్టులకు మించిన గజదొంగలు తమిళనాడు డీఎంకే వారే.

కమ్యూనిస్టుల రైతు ప్రేమ, కార్మిక ప్రేమ అంతా సమయానుకూలంగా మాత్రమే ఉంటుంది. 2007లో పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో అక్కడి కమ్యూనిస్టులు ఏం చేశారు? కర్మాగారాలకి తమ భూములు ఇవ్వమని చెప్పిన రైతుల మీద కాల్పులు జరిపారు. తమను వ్యతిరేకించిన పేదల గుడిసెలు తగలబెట్టిన ఘనత త్రిపుర కమ్యూనిస్టులది. దీనికే కమ్యూనిస్టు నిఘంటువులో ప్రజాపాలన అన్న నిర్వచనం కనిపిస్తుంది.

సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విద్య అన్నీ కొడవలి కోసిన ఆకృతిలోనే ఉండాలి. దీనిని గవర్నర్‌ ‌వ్యతిరేకించినా ఆయనను దుమ్మెత్తి పోస్తారు. పార్టీ కార్యకర్తలనీ, గూండాలనీ వైస్‌చాన్సలర్లుగా పంపించినా గవర్నర్‌ ఆమోదముద్ర వేయాలనే వాళ్లు ఆశిస్తారు. దీనిని వ్యతిరేకించిన మాజీ గవర్నర్‌ ఆరిఫ్‌ ‌మహమ్మద్‌ ‌ఖాన్‌ను నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. పార్టీ కార్యకర్తలని వీసీలుగా నియమించ డానికి నిరాకరిస్తే, విద్యావిధానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను ప్రవేశపెడుతున్నారని దుమ్మెత్తి పోశారు. ఇప్పటి గవర్నర్‌ ‌రాజేంద్ర అర్లేకర్‌ ‌రాజ్‌భవన్‌లో భారతమాత పటం పెట్టినందుకు ఎంత కాకిగోల చేశారో కామ్రేడ్లు! భారతమాత చిత్రపటం పెట్టినా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాయేనట. రాజ్‌భవన్‌ ‌కాషాయీకరణ అట.

కేరళ దేవభూమి. దీనిని ముస్లిం మతోన్మాదులకు ధారాదత్తం చేస్తున్న ఘనత సీపీఎం, కాంగ్రెస్‌లకే దక్కుతుంది. అస్సాంలో 15 జిల్లాలు ముస్లిం ఆధిక్యంలోకి వచ్చాయి. కేరళ రాష్ట్రం ఆ బాటలో ఉంది. ఇకనైనా హిందువులు మేల్కొనాలి.