News

హిందువుల మనోభావాలను కించపరిచిన చైనా.. డోర్ మ్యాట్ పై పూరీ జగన్నాథుడు

264views

చైనా యాజమన్యంలో నడిచే ఈ -కామర్స్ కంపెనీ ‘‘అలీ ఎక్స్ ప్రెస్’’ హిందూ దేవతలను తీవ్రంగా అవమానించింది. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసింది. డోర్ మ్యాట్స్ పై జగన్నాథుని బొమ్మను ముద్రించింది. అంతేకాకుండా ఓ వ్యక్తి అదే డోర్ మ్యాట్ పై కాళ్లు తుడుచుకుంటున్నట్లు కూడా చూపించింది. దీంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.

అలీ ఎక్స్ ప్రెస్ కంపెనీ ముద్రించిన ఈ డోర్ మ్యాట్స్ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ ప్రకటనలో ఓ వ్యక్తి పూరీ జగన్నాథుని చిత్రం వున్న డోర్ మ్యాట్ కే కాళ్లు తుడుచుకుంటున్నట్లు కూడా చూపించారు.

హిందూ విశ్వాసంలో, మరీ ముఖ్యంగా పూరీ వాసులకు జగన్నాథుడు ప్రత్యక్ష దైవం. ఆ దైవం కోసం తమ ప్రాణాలను కూడా ఇచ్చేందుకు రెడీగా వుంటారు. అంతటి విశ్వాసానికి, ధర్మానికి ప్రతీక అయిన దేవుడి విషయంలో చైనా ఆధారిత అలీ ఎక్స్ ప్రెస్ కంపెనీ ఇంత ఘాతుకానికి పాల్పడింది.

ఇది తీవ్రంగా అవమానించడమే అవుతుంది. అంతేకాకుండా ఈ డోర్ మ్యాట్ గురించి వివరిస్తూ..తేమను పీల్చేస్తుందని, జారిపోదంటూ వివరించింది. మరింత ఉద్దేశపూర్వకంగానే అలీ ఎక్స్ ప్రెస్ ఇలా చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు..
ఈ ఘటన వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా వేదికగా చైనాపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. #BoycottAliExpress మరియు #RespectJagannath వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రజలు స్పందిస్తున్నారు. ఈ డోర్ మ్యాట్ ను వెంటనే తొలగించి, హిందువులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్నాథుడు కేవలం మతపరమైన చిహ్నం మాత్రమే కాదని, ఒడియా సంస్కృతికి, గర్వానికి ఆధారమని పేర్కొన్నారు.