
245views
నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో సమరతసేవా భక్త బృందం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన ఆలయం ముందు భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. అనంతరం ఆలయ మాడవీధుల గుండా భజనలు చేస్తూ నగర సంకీర్తనను చేశారు. ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. మండలంలోని సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ, దైవభక్తిని పెంపొందించుకోవడం, సమాజంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడం, భగవంతుని నామస్మరణ ద్వారా శాంతిని, ఆనందాన్ని పొందడమే నగర సంకీర్తన కార్యక్రమ ముఖ్యోద్దేశం అని తెలిపారు.
మహానంది క్షేత్రంలో పల్లకీ సేవను ఆలయ వేదపండితులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌చార్జి పర్యవేక్షకుడు పసుపుల సుబ్బారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.





