
చెన్నై సెంట్రల్ సమీపంలోని కిల్పాక్‌లోని వాడ్డెల్స్ రోడ్డును అధికారికంగా ‘ఆర్చ్ బిషప్ ఎజ్రా సర్గుణం రోడ్డు’గా పేరు డీఎంకే ప్రభుత్వం పేరు మార్చింది. HR&CE మంత్రి శేఖర్బాబు, చెన్నై మేయర్ ప్రియా , DMK ఎమ్మెల్యే ఇనిగో ఇరుధయరాజ్ సమక్షంలో DMK మంత్రి KN నెహ్రూ ఒక అధికారిక కార్యక్రమంలో కొత్త నేమ్‌ప్లేట్‌ను ఆవిష్కరించారు. దీంతో వివాదాస్పద క్రైస్తవ బోధకుడి పేరును ఆరోడ్డుకు పెట్టడం పట్ల డీఎంకే ప్రభుత్వం పై ప్రజలు మండిపడుతున్నారు.
ఎవాంజెలికల్ చర్చ్ ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహించిన దివంగత ఎజ్రా సర్గుణం, హిందువులపై రెచ్చగొట్టే ,అవమానకరమైన ప్రకటనలు చేయడంలో , మత మార్పిడులను బహిరంగంగా ప్రోత్సహించడంలో దిట్ట. ఈ నిర్ణయం హిందూ సంస్థలు , సాధారణ ప్రజల నుండి తీవ్ర విమర్శలను రేకెత్తించింది, వారు దీనిని మెజారిటీ సమాజం మనోభావాలను ఉద్దేశపూర్వకంగా అవమానించినట్లుగా భావిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మైనారిటీలను సంతృప్తిపరిచే చర్యగా స్టాలిన్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
దీనిపై తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.: “చెన్నైలోని వాడ్డెల్స్ రోడ్డుకు హిందూ ద్వేషి అయిన దివంగత ఫాదర్ ఎజ్రా సర్గుణం పేరు పెట్టడం డీఎంకే ప్రభుత్వం సిగ్గుచేటు. నేను జత చేసిన వీడియో ఆయన హిందువులపై కక్కిన విషానికి రుజువు. ఆయన బహిరంగంగా హింసను రెచ్చగొట్టారు. డీఎంకే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు పరిమితులు లేవా? తమిళనాడు ప్రజలు చూస్తున్నారు. వాడ్డెల్స్ రోడ్డుకు ఫాదర్ ఎజ్రా సర్గుణం పేరు పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నేను తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నాను.” అంటూవారు ఎక్స్ లో పోస్టు చేశారు.





