
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బంగంగా ప్రాంతం నుంచి హిందూ కుటుంబాలు వలసపోతున్న వార్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానికంగా వుండే ముస్లిం ఛాందసులు హిందూ కుటుంబాలను తీవ్రంగా వేధిస్తున్నాయని, దీంతో హిందువులు వలసపోతున్నట్లు తెలుస్తోంది.
బంగంగా ప్రాంతంలోని ప్రేమ్ నగర్ అనే ప్రాంతంలో వుండే ముస్లిం ఛాందసులు హిందువులు ఇళ్లముందు బీభత్సానికి దిగుతున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని, అలాగే కత్తులతో కూడా తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో హిందువులు తీవ్ర భయాందోళనలో హిందువులు వున్నారని, అందుకే వలస వెళుతున్నారన్న ఆరోపణలు మరింత పెరిగాయి.
ఈ విషయం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలకు తెలియడంతో వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ముస్లిం ఛాందసులను నిరసిస్తూ… నిరసనకు దిగారు.బంగంగా ప్రాంతంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తూ.. హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. పోలీసులు వెంటనే ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేసి, ముస్లింలపై కఠిన చర్యలు తీసుకోవాలని, హిందువులకు రక్షణగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం జనాభా ఎక్కడైతే 15 శాతం దాటిపోయిందో.. అక్కడ గూండాయిజం, ఉగ్రవాదం పెరిగిపోతోందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అయితే.. దీనిపై పోలీసులు స్పందించారు. ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు, అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.





