
175views
సంస్కృతం నేర్చుకోవాలన్న ఔత్సాహికుల కోసం వ్యోమా లింగ్విస్టిక్ ల్యాబ్స్ ఫౌండేషన్ రూపొందించిన ఓటీటీ యాప్‌ను పద్మభూషణ సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ శనివారం బెంగళూరులో ఆవిష్కరించారు. సంస్కృతంపై ఆసక్తి ఉన్న వారిని ఒక్క తాటిపైకి తీసుకురావడానికి విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆచార్యులు, బోధకులు దీన్ని ఏర్పాటు చేశారని సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ వాణిశ్రీ రఘుపతి వెల్లడించారు. చిత్రాలతో కూడిన కథలు, సంస్కృత వ్యాకరణ ప్రవేశిక విభాగాలు, ఆడియో ఫైళ్లు ఇందులో అందుబాటులో ఉంచినట్లు ఓటీటీ రూపకల్పన సమితి సభ్యుడు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం-బెంగళూరు)లో విశ్రాంత ఆచార్యుడు బి.మహదేవన్ తెలిపారు.





