
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం భారీగా బలగాలను తరలిస్తోంది. ఆయా రాష్ట్రాలకు ఐదు వేల మంది సైనికుల్ని తరలిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడడంతో అక్కడి నుంచి 20 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను తరలించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. మీడియా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. జమ్మూ నుంచి మొత్తం 20 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను జమ్మూ నుంచి అసోంకు పంపినట్లు తెలుస్తోంది. వారు త్వరగా అసోం చేరుకునేలా ఒక ప్రత్యేక రైలు సర్వీసును సైతం ప్రారంభించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా 30 కంపెనీల బలగాలను ఈశాన్య రాష్ట్రాలకు తరలించనుంది. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో పలు చోట్ల పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ఈశాన్య రైల్వే శాఖ ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు రైళ్లను రద్దు చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆగస్టులో కేంద్రం భద్రతా బలగాలను భారీగా తరలించింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





