News

60 వేల మొక్కలు నాటిన అస్సాం ఉపాధ్యాయుడు

279views

ప్రకృతిని కాపాడేందుకు అస్సాంకు చెందిన ఓ వృక్ష ప్రేమికుడు నడుం బిగించారు. 24 ఏళ్లలో ఏకంగా 60,000 మొక్కలను నాటి ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. బొంగైగావ్‌ జిల్లాలోని తులుంగియా గ్రామానికి చెందిన బుద్ధేశ్వర్‌ రాయ్‌ది పేద కుటుంబం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమాజానికి, ప్రజలకు ఏదైనా చేయాలనే లక్ష్యంతో 2001 నుంచి మొక్కలు నాటడాన్ని మొదలు పెట్టారు. తన సంపాదనను రహదారులు, పాఠశాలలు, గ్రామాల్లో, బంజరు భూముల్లో మొక్కలు నాటడం కోసం వినియోగించేవారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చాక కూడా ఇది కొనసాగుతోంది. జాతీయ రహదారి-31కి ఇరువైపులా నాటిన 12,000కు పైగా మొక్కలు వృక్షాలుగా ఎదిగాక 2019లో రహదారి విస్తరణకు అధికారులు రాత్రికి రాత్రే నరికేశారు. అదే రహదారికి ఇరువైపులా మళ్లీ మొక్కలు నాటడం ప్రారంభించానని బుద్ధేశ్వర్‌ తెలిపారు.