
నెల్లూరు నగరంలోని స్వామి వివేకానంద హైస్కూల్ నందు ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆరెస్సెస్ పరిచయ వర్గ జరిగింది.ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుండి వివిధ రంగాలకు చెందిన 65 మంది ప్రతిష్ఠితవ్యక్తులు పాల్గొన్నారు. నెల్లూరు విభాగ్ మాననీయ సంఘచాలక్ హరికుమార్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాoత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్, ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు తదితరులు పాల్గొని మార్గదర్శనం చేశారు. దేశ సమస్యలు – పరిష్కారం( హిందుత్వము ,జాతీయత మీద జరుగుతున్న దాడులు, మత మార్పిడులు, పర్యావరణం ) గురించి చర్చ జరిగింది.

ప్రసంగిస్తున్న భరత్ జీ

ప్రసంగిస్తున్న శ్రీ బయ్యా వాసు
దిక్సూచి, ఆన్ మాస్క్ మొదలగు జాతీయ భావాలు గల యూట్యూబ్ ఛానెల్స్ గురించి తెలియజేశారు. సంఘం గురించి పరిచయం చేసే వీడియోలు ప్రదర్శించారు. ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ RSS విషయంలో సభికులు వెలువరించిన సందేహాలను నివృత్తి చేశారు. మాదిరి శాఖ జరిగింది. చివరగా భరత్ జీ సమరోప్ లో మాట్లాడుతూ వ్యక్తి నిర్మాణం ఆవశ్యకత గురించి, సంఘం సాధించిన విజయాలు గురించి వివరించారు. సమాజములో ప్రతిష్ట కలిగిన వ్యక్తులు సంఘ కార్యంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ తమకు అభిరుచి కలిగిన కార్యక్రమాల ద్వారా భాగస్వాములు కావాలని పిలిపునిచ్చారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





