News

వైభవంగా జగన్నాథ రథోత్సవం

303views

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడిలోని పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి జగన్నాథ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై జగన్నాథ, సుభద్ర, బలరాములతో ఆశీనులు అయ్యారు. అనంతరం హారతులు ఇచ్చి.. హరే రామ సంకీర్తన, మేళతాళాలతో రథోత్సవం బయలు దేరింది. రథం బయలు దేరే మార్గంలో రంగులతో వేసిన రంగవల్లులు భక్తులను ఆకట్టుకున్నాయి. పూలను చల్లుతూ ‘హరేరామ, హరేరామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ’ అంటూ నామ స్మరణతో భజనలు చేస్తూ రథయాత్రను ముందుకు సాగించారు. చిరు జల్లులు కురుస్తున్నప్పటికీ భక్తులు భక్తి పార్యవశ్యంతో స్వామివారి రథంతో ముందుకు సాగారు. పట్టణంలోని పుర వీధుల మీదుగా జువ్వలపాలెం రోడ్డులోని ఏఎస్‌ఆర్‌ నగర్‌లో ఉన్న అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వరకు సాగింది. అక్కడ స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజలు చేశారు. రథోత్సవానికి ఎక్కడా ఇబ్బందులు రాకుండా పోలీసు అధికారులు బందోబస్తును నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని భక్తులు అందించారు.