News

అన్య మత ప్రచారాన్ని అడ్డుకున్న గిరిజనులు

1.3kviews

కొందరు వ్యక్తులు తమ గ్రామంలో అన్యమత ప్రచారం నిర్వహించడానికి ప్రయత్నించగా వారిని ఆ గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించి వెనక్కు తిప్పి పంపిన ఘటన నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామమైన పాలుట్లలో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఓ వాహనంలో వచ్చిన సుమారు 20 మంది వ్యక్తులు పాలుట్ల గ్రామంలో ప్రార్థనా మందిరం నిర్మించి, ఏసయ్యను నమ్ముకుంటే పేదలకు సాయం చేస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని గమనించిన గిరిజనులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేర్లు ఏమిటి? అని గ్రామస్తులు ప్రశ్నించినా వివరాలు ఏమీ చెప్పకుండానే వారు వెళ్లిపోయారు. వన్యప్రాణి విభాగంలో కీలకమైన అటవీ ప్రాంతంలోకి ఏ అనుమతులూ లేకుండా ఎలా ప్రవేశించారని వారిని ప్రశ్నించామని ఆ గ్రామస్తుడు ఈదన్న పేర్కొన్నారు. దానికి కూడా ఏ సమాధానము ఇవ్వకుండా వారు తిరిగి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. అనుమతులు లేకుండా వచ్చిన ఆ వ్యక్తులపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తులు తమ అనుమతి లేకుండానే అడవిలోకి వెళ్లారని గంజివారి పల్లె అటవీ క్షేత్రాధికారి నాగరాజా తెలిపారు. పాలుట్ల వాసులు ఇచ్చిన సమాచారంతో తాము బేస్ క్యాంపు సిబ్బందిని అప్రమత్తం చేశామని, వారి చర్యలపై విచారణ చేస్తామని తెలిపారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.