News

రాష్ట్రంలో ఉదృతంగా, ఉద్యమంలా మతమార్పిడులు?

1.6kviews

రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్న వార్తలను పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో మత మార్పిడులు ఉధృతంగా జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఒక్క రాజమండ్రి గోదావరి ఘాట్లలోనే రోజూ పదుల సంఖ్యలో మత మార్పిళ్లు జరుగుతున్నాయి. అలాగే విజయవాడలోని ఫెర్రీ ఘాట్లో సైతం ప్రతి రోజూ పదుల సంఖ్యలో మత మార్పిడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఒక్క రోజే 47 మందిని మతం మార్చినట్లుగా సమాచారం. అదే నిజమైతే హిందూ సమాజానికి డేంజర్ బెల్స్ మ్రోగినట్లే. ఈ పరిణామాలను సమర్థంగా ఎదుర్కోక పోతే రాష్ట్రంలో హిందువుల భవిష్యత్తు అంథకారమేనని హిందూ ధార్మిక సంఘాలు హిందువులను హెచ్చరిస్తున్నాయి. ఏ అండ చూసుకుని క్రైస్తవ మత మార్పిడి ముఠాలు రాష్ట్రంలో ఇలా చెలరేగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.     

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.