News

యోగా దినోత్సవంను నిష్ఠగా అభ్యసించిన సంఘమిత్ర చిన్నారులు”

246views

నంద్యాల జిల్లా, స్థానిక సంఘమిత్ర ఆవాసంలో “అంతర్జాతీయ యోగా దినోత్సవం” సంఘమిత్ర చిన్నారులు నిష్ఠగా జరుపుకున్నారు.

‘యోగా’ ఆవాస దైనందినిలో ఒక ప్రధాన భాగం. ఆవాసంలో కాని బయట కాని మన చిన్నారులు ఏ ప్రదర్శన ఇచ్చినా అందులో ప్రధాన ఆకర్షణగా నిలిచేది యోగా మాత్రమే, ఎంతటి క్లిష్టమైన ఆసనాలైనా అవలీలగా వేయడం వారి ప్రత్యేకత, అది మన చిన్నారులు ప్రతిభ. దీనికి ప్రధాన కారణ మైన యోగా శిక్షకురాలు, ఆవాస కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి వెంకటేశ్వరిని, దైనందిన యోగా అభ్యాసాన్ని పర్యవేక్షిస్తున్న ఆవాస్ ప్రముఖ్ శ్రీ గంగాధర్ కృషిని అథితులు ప్రశంసించారు. వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి ప్రధాన మార్గ మైన యోగాను నిరంతరం, జీవితాంతం ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని అతిథులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాస్, ముఖ్య అతిథి శ్రీ నిచ్చెన మెట్ల సుబ్బరామయ్య, కార్యదర్శి శ్రీ కర్నాటి నాగ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీ జె.వెంకటేశ్వర్లు, కోశాధికారి శ్రీ సముద్రాల నాగ రాజయ్య, కార్యవర్గ సభ్యుడు శ్రీ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

ఈసారి జిల్లాస్థాయి యోగా దినోత్సవ కార్యక్రమంలో సంఘమిత్ర చిన్నారులు వేదికపై ఆదర్శ ప్రదర్శనకు ఎన్నుకోబడడం వారి ప్రతిభకు తార్కాణం.