
హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఆరొగ్య భారతీ మరియు ఇషా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MBA మరియు MCA విభాగాల నుండి 110 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని డా.ఎస్.వి. రమణ, హిందూ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రారంభిస్తూ, యోగా ప్రాచీన భారత ఋషుల అనువంశిక ఆస్తిగా మాత్రమే కాక, నేటి ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యానికి మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.
డా. ప్రుధ్విరాజు, ఆరొగ్య భారతీ ప్రతినిధిగా, యోగా దినోత్సవ ఉద్దేశ్యాన్ని వివరించారు. ఆయన మాట్లాడుతూ, భారత దేశం ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించేందుకు తీసుకుంటున్న యత్నాలలో యోగా ఒక గొప్ప సాధనమని తెలిపారు. యోగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మారింది అని గర్వంతో తెలియజేశారు.

ఇషా ఫౌండేషన్ గుంటూరు బృందానికి చెందిన శ్రీ సుధాకర్ నేతృత్వంలో విద్యార్థులకు యోగా సాధనా ప్రదర్శన నిర్వహించబడింది. శరత్ గారు, యోగా ఫుల్‌టైమర్‌గా, ఆసనాలు, శ్వాస నియంత్రణలు, ధ్యానం వంటి అంశాలను విద్యార్థులకు వివరణాత్మకంగా నేర్పారు.
ఈ కార్యక్రమం విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చే దిశగా స్ఫూర్తినిచ్చింది. హిందూ కాలేజ్, ఆరొగ్య భారతీ మరియు ఇషా ఫౌండేషన్ మధ్య ఐక్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఆరోగ్య భావన మరింత బలపడనుంది.





