News

”మా ఇల్లు అమ్మకానికి ఉంది”: 40 హిందూ కుటుంబాల పోస్టర్లు

229views

ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలోని ముబారక్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటా పురా ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇక్కడ ఉన్న దాదాపు 40 హిందూ కుటుంబాలు వలస వెళ్తామని అంటున్నాయి. తమకు, తమ కుటుంబీకులకు భద్రతలేదని వారు చెప్పే కారణం. అక్కడ ఉన్న హిందూ కుటుంబాలు వారి ఇంటిముందు’ మాది హిందూ కుటుంబం, మా ఇల్లు అమ్మకానికి ఉంది’ అని పోస్టర్లు అతికించారు. ఎందుకంటే అంతకుముందే చోటుచేసుకున్న ఓ వివాదం కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వారన్నారు.

జూన్ 3న అక్కడ జరిగిన రాకేష్ కన్నౌజియా వివాహం లో ఓ వివాదం జరిగింది.. సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలో పాల్గొన్న మహిళలు చెరువు వద్దకు వెళ్లినప్పుడు, గ్రామంలోని కొంతమంది యువకులు వారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి వీడియోలు తీయడం ప్రారంభించారు. దాంతో ఆ మహిళలు తీవ్రఆగ్రహానికి లోనై నిరసనను వ్యక్తం చేయడంతో, అక్కడ గొడవ జరిగి దాదాపు 20 మంది గాయపడ్డారు.

ఈ సంఘటన తర్వాత, నిందితులైన యువకులు తమను నిరంతరం బెదిరిస్తున్నారని, దీని కారణంగా తాము భయపడుతున్నామని అనేక హిందూ కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమకు రక్షణ కల్పించకపోతే, గ్రామం విడిచి వెళ్లాల్సి వస్తుందని బాధితులు తెలిపారు. ఈ విషయంపై కేసునమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే స్పందించారు. పోలీసులు ఇప్పటివరకు అర్మాన్, వసీం, రెహ్మాన్, మోజ్జం మరియు ఒక మైనర్ సహా 10 మంది నిందితులను అరెస్టు చేశారు. అంతేకాక గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత దృష్ట్యా పోలీసు బలగాలను మోహరించారు.

అయితే, ‘ఘర్ బికావు హై’ అనే పోస్టర్లను ఎన్నికల స్టంట్‌గా ఎస్‌ఎస్‌పి హేమ్‌రాజ్ మీనా అభివర్ణించారు. ఇదంతా గ్రామానికి చెందిన ఒక యువకుడు చేస్తున్నాడని, అతను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాడని, గతంలో జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేశాడని ఆయన చెబుతున్నారు. అయితే ఈ బమ్హౌర్ గ్రామం గతంలో కూడా దేశీయ పిస్టళ్లను తయారు చేయడంలో వార్తల్లో నిలించింది. ఇప్పుడు ఈ గ్రామం శాంతిభద్రతల సమస్యపై మళ్లీ వెలుగులోకి వచ్చింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టంతో ఎవరూ ఆడుకోవడానికి అనుమతించబోమని పోలీసులు హామీ ఇచ్చారు.