News

సంఘమే శ్వాసగా జీవించిన సూర్యప్రకాశరావు

400views

సంఘమే శ్వాసగా జీవించిన చినముత్తేవి సూర్య ప్రకాశరావు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ జిల్లా వ్యవస్థా ప్రముఖ్ గా, విశ్వ హిందూ పరిషత్ కృష్ణాజిల్లా కార్యదర్శిగా, అనిబిసెంట్ శిశు విద్యా మందిర్ పాఠశాల కమిటీ సభ్యులుగా, 83 సంవత్సరాలు తన జీవిత కాలంలో 60 సంవత్సరాలు పైగా స్వయం సేవకులుగా పనిచేసి స్వర్గస్తులైన చినముత్తేవి సూర్యప్రకాశరావు గారి సంస్మరణ సభ 18.6.25 సా. 6 గంటలకు వేమూరి వెంకటసుబ్బయ్య కళ్యాణమండపంలో నిర్వహించబడినది. సూర్య ప్రకాశ్ (SP) అంటే సమయపాలన అని పలువురు స్వయం సేవకులు అభిప్రాయపడ్డారు. డాక్టర్ జీ, గురూజీ లను మనమంతా స్వయంగా చూసి ఉండకపోవచ్చు కానీ సూర్య ప్రకాష్ రావు గారి వంటి మహోన్నతుల లో వారిని చూడవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.

మన హిందూ ధర్మం లో పుట్టుక ఎంత పండుగో నిష్క్రమణ కూడా అంతే పండుగ. గొప్పవారు నిష్క్రమణ మనల్ని బాధించినా వారి ఆశయాలను గుర్తు చేసుకుని తదనుగుణంగా పనిచేసి విజయులమవడం గొప్పదని సభ్యులు గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంలో మచిలీపట్నం అందించిన సేవకులైన నండూరి సీతారామయ్య, వడ్డి చంద్రశేఖర రావు, వడ్డి విజయసారథి , కోనేటి రావు వంటి వారి ఘనతను గుర్తు చేసుకున్నారు.

నగరసంచాలక్ డాక్టర్ చిట్టా శ్రీహరిగారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆరోగ్యభారతి అఖిల భారత సహ సంయోజక్ డాక్టర్ ఆర్ మురళీకృష్ణ గారు, విశ్వ హిందు పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ నాయుడు గారు, శ్రీ వివేకానంద కేంద్ర _ కన్యాకుమారి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సంయోజకులు శ్రీ సి. వి. సదాశివ గారు, విజయవాడ విభాగ ప్రచారక్ శ్రీ నవీన్ జీ, ముడా చైర్మన్ శ్రీ మట్టా ప్రసాద్, బీజేపీ,వి.హెచ్.పి, సంఘ కార్యకర్తలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు హాజరై శ్రీ సూర్య ప్రకాష్ రావు గారికి నివాళులర్పించారు.

ఇందులో ఈ కార్యక్రమంలో విభాగ్ ప్రచారక్ శ్రీ నవీన్ గారు, ఆరోగ్య భారతి అఖిల భారత సహా సంయోజక్ శ్రీ మురళి కృష్ణ గారు, విశ్వహిందూ పరిషత్ ప్రాంత ప్రముఖ్ శ్రీ PVS నాయుడు గారు, మచిలీపట్నం నగర సంఘ్ చాలక్ శ్రీ చిట్ట శ్రీహరి గారు, కన్యాకుమారి వివేకానంద కేంద్రం ఆంధ్ర తెలంగాణ సంయోజక్ శ్రీ సదాశివ గారు పాల్గొని ఆయన సేవలను కొనియాడంతో పాటు వారి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.