
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తన కార్య విస్తరణ కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఈ ఏడాది అనేక క్రొత్త మండలాలు, గ్రామాలలో సంఘ శాఖల ప్రారంభానికి ఆర్. ఎస్. ఎస్ ప్రయత్నిస్తోంది. ఆర్. ఎస్. ఎస్ తన పని సౌలభ్యం దృష్ట్యా మన రాష్ట్రంలోని 13 రెవెన్యూ జిల్లాలను 31 సంఘ జిల్లాలుగా (ఒక్కొక్క రెవెన్యూ జిల్లాను 2- 4 సంఘ జిల్లాలుగా) విభజించుకున్నది. అలాగే ప్రతి రెవెన్యూ మండలాన్నీ 2 లేదా 3 సంఘ మండలాలుగా విభజించుకుంది. ప్రతి సంఘ మండల పరిధిలోనూ 5 నుంచి 8 గ్రామాలు ఉంటాయి. తన కార్య విస్తరణలో భాగంగా 2019 డిసెంబర్ 1 న ప్రతి సంఘ మండల కేంద్రంలోనూ ఆ సంఘ మండలంలోని అన్ని గ్రామాల నుంచి కొందరు స్వయంసేవకులతో రాష్ట్రమంతా ఒకే సమయంలో సాంఘీక్ జరపాలని ఆర్. ఎస్. ఎస్ పెద్దలు నిర్ణయించారు.

కృష్ణా జిల్లా నందిగామలో ఆర్. ఎస్. ఎస్ ఆంధ్ర ప్రాంత సంఘచాలక్ శ్రీ భూపతిరాజు శ్రీనివాస రాజు

కృష్ణా జిల్లా వెల్వడంలో ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్

ప్రకాశం జిల్లా మేదరమెట్లలో ఆంధ్ర సహ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య
పెద్దలు సూచించిందే తడవుగా కార్యకర్తలు రాష్ట్రంలోని గ్రామ గ్రామాన్ని పర్యటించారు. స్వయంసేవకులకి సమాచారం అందించారు. గతంలో సంఘ శాఖలు లేని గ్రామాలకు, కొంతకాలం శాఖ జరిగి ఆగిన గ్రామాలకు కార్యకర్తలు చేరుకొని అక్కడి వారిని సమీకరించి, సమాయత్తం చేసి డిసెంబర్ 1 సాయంత్రం 4 -6 గంటల మధ్యలో రాష్ట్రంలోని 1859 సంఘ మండలాలకు గానూ 1809 మండల కేంద్రాలలో సాంఘీక్ లు నిర్వహించారు. రాష్ట్రం మొత్తంలో గల 13052 గ్రామాలకు గానూ 4783 గ్రామాల నుంచి స్వయంసేవకులు సాంఘీక్ లలో పాల్గొన్నారు. దీంతో రాష్ట్రంలోని 1809 కేంద్రాలలో ఒకేరోజు ఒకే సమయంలో కాషాయ ధ్వజాలు రెపరెపలాడాయి.

కర్నూలు జిల్లా గోపవరంలో ఆంధ్ర సహ ప్రాంత కార్యవాహ శ్రీ యుగంధర్
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఆంధ్ర ప్రాంత సంపర్క ప్రముఖ్ శ్రీ ఓలేటి సత్యనారాయణ
ఈ సాంఘీక్ లలో మొత్తం 12,243 మంది విద్యార్థులు పాల్గొనగా 29,666 మంది వివిధ వృత్తుల వారు పాల్గొన్నారు. ఆ విధంగా మొత్తం 41,909 మంది ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సాంఘీక్ ల నిర్వహణలో 5,317 మంది పాలు పంచుకోవడం విశేషం. వీటిలో 34 సాంఘీక్ లలో 100 మందికి పైగా స్వయంసేవకులు పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా 748 మండలాలలోని 2943 మంది స్వయంసేవకులకు క్రొత్తగా వివిధ బాధ్యతలు ప్రకటించారు.

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలిలో ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోడూరు సత్యం
అన్ని చోట్లా స్వయంసేవకులు ఉత్సాహంగా ఆయా సాంఘీక్ లలో పాల్గొన్నారు. బాల్యంలో, యవ్వనంలో శాఖకు వచ్చి ఆనక మళ్ళీ ఇప్పుడు ఈ సాంఘీక్ కు వచ్చిన పెద్దలెందరో తమ చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





