News

విజయవాడలో అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం

854views

కార్తీకమాస మాస శివరాత్రి నాడు విజయవాడ మహా నగర్ జక్కంపూడి కాలనీ గ్రౌండ్లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో కోటి దీపార్చన కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో కోటి లింగాలలోని శైవ క్షేత్రాదిపతి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి, శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తి పీఠానికి చెందిన శ్రీ కరుమారి అమ్మ, పెదకాకానిలోని నవ శక్తి పీఠానికి చెందిన శ్రీ భవాని శంకరానంద స్వామీజీ, శ్రీ కళ్యాణ్ స్వామీజీల ఆధ్వర్యంలో శ్రీచక్ర యంత్ర పూజ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రజలందరూ మతాలకు అతీతంగా ధర్మం వైపు పయనించాలని, భారతదేశంలో పూర్వం అందరూ హిందువులేనని, విదేశీయుల పాలనలో వారి ఒత్తిడి, ప్రలోభాల కారణంగా అనేకమంది మతమార్పిడులకు గురయ్యారని, అందరూ తిరిగి స్వధర్మం వైపు పునరాగమనం చెయ్యాలని కోరారు.

సుమారు మూడు వేల మంది పాల్గొన్న ఈ కోటి దీపార్చన కార్యక్రమంలో కోలాటం, భరతనాట్యం, గంగిరెద్దుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికీ ధర్మ జాగరణ సమితి వారు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ధర్మ జాగరణ ప్రాంత సహ పరియోజన ప్రముఖ్ శ్రీ రాయుడు ముత్యాలరావు, కృష్ణాజిల్లా ధర్మ జాగరణ జట్టు సభ్యులు మరియు విజయవాడ సిటీ సభ్యులు కలిసి నిర్వహించిన ఈ కోటి దీపార్చన కార్యక్రమము అత్యంత వైభవంగా, ఆకర్షణీయంగా జరిగింది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.