News

మతం మాారాలని మహిళకి అత్తా మామల చిత్రహింసలు..

340views

బిహార్ లోని జముయ్ ప్రాంతంలో బలవంతపు మత మార్పిడి వెలుగులోకి వచ్చింది. తనను తన అత్తామమలు క్రైస్తవంలోకి మారాలని బలవంతపెడుతున్నారని, తాను నిరాకరిస్తున్నా… రోజూ బలవంతపెడుతున్నారని సోనాలీ దేవి అనే మహిళ ఆరోపించింది. క్రైస్తవం తీసుకోవాలని బలవంతం పెట్టడమే కాకుండా, నిరాకరించినందుకు తనను తీవ్రంగా కొట్టి, చిత్ర హింసలు పెడుతున్నారని కూడా ఆ మహిళ వెల్లడించింది. దీంతో తాను తాళలేక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని కూడా పేర్కొన్నారు. తన బావమరిది కన్హయ్య, పంచుదాస్ తనపై కర్రలతో దాడులు చేశారని, చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.

బాధితురాలి ప్రకారం, ఆమె మామ తర్ణి దాస్, అత్త సురుతి దేవి మరియు బావమరిది కన్హయ్య దాస్ సహా ఆమె అత్తమామలు క్రైస్తవ మతంలోకి మారమని నిరంతరం ఒత్తిడి తెచ్చారని, వీరందరూ క్రైస్తవాన్ని స్వీకరించారని, అయినా హిందువలమనే చెప్పుకుంటున్నారని పేర్కొంది.

అంతేకాకుండా క్రైస్తవంలోకి రాకుంటే తన వాటాకు వచ్చే ఆస్తిని కూడా ఇవ్వమని బెదిరిస్తున్నారని, వాటా ఇచ్చే ప్రసక్తే లేదని అంటున్నారని కూడా వెల్లడించింది. మరోవైపు తాను క్రైస్తవాన్ని స్వీకరించనని, హిందువుగానే బతుకుతానని చెప్పినందుకు, తెగ అవమానిస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా తనపై మంత్రగత్తె అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. స్థానిక పోలీసులకు ఈ విషయం చెప్పినా, వినిపించుకోలేదని జిల్లా ఎస్పీకి వివరించింది.

తన అత్తమామల నిరంతర వేధింపుల కారణంగా ఆరు సంవత్సరాలుగా తన తల్లిదండ్రుల ఇంట్లో ఆశ్రయం పొందాల్సి వచ్చిందని సోనాలి ఆరోపించారు. తన అత్తమామలు తనను హిందూ ఆచారాలు చేయకుండా, హిందూ దేవతలను పూజించకుండా నిషేధించారని, అవమానించారని పేర్కొంది. తమ సొంత ఖర్చులతో ఇంటిని కూడా బాగు చేయించామని, అయినా తమనే ఇంట్లో వుండనివ్వడం లేదని వాపోయింది. జిల్లా ఎస్పీ చొరవతో పోలీసులు కేసు దర్యాప్తునే వేగిరం చేశారు.

(source : Organiser)