News

గురుద్వారాలు, దేవాలయాలపై పాకిస్తానే కాల్పులు జరిపింది : గురుద్వారా చీఫ్

241views

పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు జరపడంతోనే దేవాలయాలు, గురుద్వారాలు, దేవాలయాలకు నష్టం వాటిల్లిందని సహబ్ మహంత్ సాబ్ జీ గురుద్వారా గ్రంథి అధ్యక్షుడు భాయ్ సురేందర్ సింగ్ ప్రకటించారు. పాకిస్తాన్ జరిపిన కాల్పుల వల్ల పిల్లలకు చదువు చెబుతున్న ఓ ఉపాధ్యాయుడు కూడా చనిపోయాడని వెల్లడించారు. పాక్ మన నగరాలపై, ప్రజలపై, ఇళ్లపై కాల్పలు జరిపిందని, గురుద్వారాలపై కూడా దాడి చేసిందని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ అపఖ్యాతి పాలైందని, ఇప్పుడు తాము తప్పులు చేసి, భారత సైన్యాన్ని నిందిస్తోందని ఇది సిగ్గుచేటు అని అన్నారు. భారత రక్షణ దళాలు పాకిస్తాన్ కి గట్టి జవాబిచ్చాయని, దీనిని ప్రపంచం మొత్తం చూసిందన్నారు.

ఎప్పుడూ సత్యమే మాట్లాడాలని, చివరికి సత్యమే గెలుస్తుందని భాయ్ సురేందర్ సింగ్ అన్నారు. గురుద్వారాలు, దేవాలయాలపై దాడులు చేస్తూ… నష్టం చేస్తూ వున్నా.. పాకిస్తాన్ సిగ్గు లేకుండా భారత సైన్యాన్ని నిందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటి వెనుకా పాక్ వుందని తెలిపారు.ఒకటి కాదు… మూడు గురుద్వారాలు పాక్ జరిపిన కాల్పుల్లో ధ్వంసమయ్యాయని, పూంచ్ లోని అతిపెద్ద గురుద్వార అయిన గురు సింగ్ సభా పూంచ్, గురుద్వారా కృష్ణ ఘాటితో పాటు జమ్మూ కశ్మీర్ లోని సిక్కులకు పవిత్రమైన మరో గురుద్వారా కూడా ధ్వంసమైందన్నారు.వీటితో పాటు డేరా నంగలి సాహిబ్ అని పిలిచే గురు గోవింద్ సింగ్ మహారాజ్ స్థలం కూడా ఈ కాల్పులకు ప్రభావితమైందని తెలిపారు.

ఈ సంఘటనలు అత్యంత దురుదృష్టకరమని అన్నారు. పాకిస్తాన్ కాల్పులు జరుపుతున్న సమయంలో తాను గురుద్వారలోనే వున్నానని, ఈ సమయంలోనే గురుద్వారా కోశాధికారి పాక్ జరిపిన కాల్పుల్లో మరణించారని వెల్లడించారు.

‘‘ఈ సంఘటనలన్నీ దురదృష్టకరం. ఏమాత్రం వెనకడుగు వేయకుండా పాక్ వ్యవహరించింది. గురుద్వారా కోశాధికారి అమరుడైనప్పుడు నేను గురుద్వారాలోనే వున్నాను. ఈ సమయంలో కోశాధికారి పవిత్ర గ్రంథాలను పారాయణం చేస్తున్నారు. నాతో మాట్లాడిన 5 నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పులు జరపడం ప్రారంభించింది. ఈ సమయంలో అతని ఇంటి దగ్గరే ప్రాణాలు కోల్పోయారు. అసలు విషయాలను పక్కన పెట్టి, పాక్ తప్పుడు ప్రచారానికి దిగుతోందని, దీనిని ప్రపంచం గమనిస్తోంది’’ అని సురేందర్ సింగ్ తెలిపారు.