News

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ – ముస్లిం పర్సనల్ లా బోర్డు వెల్లడి

974views

యోధ్యలోని భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇది తమ హక్కు అని ఇస్లామిక్‌ సంస్థ జమైత్‌ ఉలేమా-ఎ-హింద్‌ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదానీ వ్యాఖ్యానించారు. గతంలో అయోధ్య భూవివాద పరిష్కారం జరిగిన మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈ సమావేశానికి హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సైతం హాజరయ్యారు.

సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయబోమని సున్నీ వక్ఫ్‌ బోర్డు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు రివ్యూ పిటిషన్‌ వేయాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.#AYODHYA

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.