
విద్యార్థులు ఏడాదిపాటు పొదుపు చేసిన నగదుతో బాలల దినోత్సవం నాడు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని నిడిగుంటపాళెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారానికి ఒక్క రూపాయి చొప్పున కూడబెట్టి ఏడాదిపాటు దాచిన నగదుతో గ్రామంలోని 55 మంది వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. ఇలా సేవ చేయాలనే సంకల్పాన్ని విద్యార్థులలో కల్పించిన ఆ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ ఆర్ ఆర్ ఎస్ ప్రసాద్ ని అందరూ అభినందిస్తున్నారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జయభారత్ హాస్పిటల్ మేనేజర్ శ్రీ గురు ప్రసాద్ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవాటు చేసుకోవాలని శ్రీ గురుప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మరుధ్వతి, ఇతర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





