
934views
ఇటీవలే సుప్రీంకోర్టు రామ మందిరం-బాబ్రీ మసీదు వివాదానికి ముగింపు పలుకుతూ తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రామ మందిర నిర్మాణం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రామ మందిర నిర్మాణం కొరకు విరాళాలు అందుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ కూడా రామ మందిర నిర్మాణం కోసం తన వంతుగా విరాళాన్ని అందించారు. ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ మందిర నిర్మాణానికి 51 వేల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఆయన నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





