
417views
సమరసతా సేవా ఫౌండేషన్ SSF ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తిరుపతిలో బాల వికాస కేంద్ర వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, బాలవికాస్ కేంద్రాలు బాల బాలికలలో సంస్కార వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజ అభ్యున్నతికి బాల వికాస కేంద్రాల విద్యార్థినీ విద్యార్థులు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని, ఇలాంటి బాల వికాస కేంద్రాలు మరెన్నో ఏర్పాటు చేయవలసిన అవసరముందని అన్నారు.
అనంతరం జరిగిన అర్చకుల సమావేశంలో పాల్గొని వారితో అనేక విషయాలు చర్చించి, దేవాలయ నిర్వహణలో ఇంకా శ్రద్దా భక్తులలో పనిచేసి భక్తుల మన్ననలు పొందాలని అర్చకులతో ముచ్చటించారు. అలాగే గుడి కేంద్రముగా రోజూ జరుగుతున్న కార్యక్రమాలు తెలుసుకొని వారినందరిని అభినందించారు.




